OTT Suggestions- Best Comedy Drama The Boys: బ్యాచిలర్స్ ఇంత ఘోరంగా ఉంటారా? OTTలో ఈ మూవీకి పొట్ట చక్కలవుతుంది!

బ్యాచిలర్స్ ఇంత ఘోరంగా ఉంటారా? OTTలో ఈ మూవీకి పొట్ట చక్కలవుతుంది!

OTT Suggestions- Best Bachelor Comedy Drama: బ్యాచిలర్స్ కి ఇల్లు ఇస్తే ఎంత దారుణంగా ఉంటుందో.. ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇంటిని ఒక బార్ లెక్క చేసేసి.. నానా హంగామా చేస్తారు. రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటే మాత్రం ఓనర్స్ అల్లాడిపోతారు.

OTT Suggestions- Best Bachelor Comedy Drama: బ్యాచిలర్స్ కి ఇల్లు ఇస్తే ఎంత దారుణంగా ఉంటుందో.. ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇంటిని ఒక బార్ లెక్క చేసేసి.. నానా హంగామా చేస్తారు. రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటే మాత్రం ఓనర్స్ అల్లాడిపోతారు.

బ్యాచిలర్స్ అంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కి ఇల్లు దొరకడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఇంటి ఓనర్స్ ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే కొందరు బ్యాచిలర్స్ చేసే గొడవకు కచ్చితంగా ఇల్లు ఇవ్వాలి అంటే భయపడాలి. పైగా ఆ బిల్డింగ్ లో ఫ్యామిలీస్ ఉంటే మాత్రం అది మరింత కష్టంగా మారుతుంది. ఓనర్స్ భయానికి తగ్గట్లుగానే బ్యాచిలర్స్ ఇంటిని ఎక్స్ బిషన్ చేసేస్తారు. అలాంటి ఒక పాయింట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమా చూస్తే నవ్వి నవ్వి పొట్ట చక్కలు అవ్వాల్సిందే. మరి ఆ సినిమా ఏది? అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఇది కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది బ్యాచిలర్స్ కి సంబంధించిన చిత్రం. ఇల్లు కోసం వాళ్లు ఎన్ని కష్టాలు పడతారు? ఆ ఇల్లు దొరికిన తర్వాత వాళ్లు ఎంత హంగామా చేస్తారు అనే పాయింట్ మీద ఈ మూవీని తీశారు. ఈ చిత్రం దాదాపుగా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. చదువుకునే రోజులు, ఉద్యోగాలు చేసేటప్పుడు పొరుగురులో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి హ్యాచిలర్స్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. పైగా అందరూ కూడా వారి రియల్ లైఫ్ లో చేసిన గొడవలు, వేసిన చిల్లర వేషాలు అన్నీ ఈ మూవీలో ఉన్నాయి.

ముఖ్యంగా మీరు ఈ సినిమాలో మందు, మగు*వ, బూ*తులు ఎక్కువ వింటారు. ఒక రూమ్ లో ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందరు పెళ్లి కావాల్సిన.. ఏదో ఒక పని చేసుకునే వాళ్లే. కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.. ఇంకొందరు డెలివరీ బాయ్ గా చేస్తుంటారు. వీళ్లంతా ఒకేచోట ఉంటే మాత్రం ఆ రోజు ఇల్లు కిష్కింతకాండ అవుతుంది. ఇంక ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్ ఒక జెమ్ అని చెప్పాలి. అయితే ఈ మూవీ కేవలం తమిళ్ లోనే ఉంది. కచ్చితంగా తెలుగులోకి కూడా డబ్ చేయాల్సిన సినిమా ఇది. కానీ, తమిళ్ అయినా కూడా కథ మాత్రం మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది.

ఎందుకంటే ఈ మూవీకి అందరూ కనెక్ట్ అవుతారు. అంతేకాకుండా వారి రోజులను ఈ మూవీలో చూసుకుని కాసేపు మెమొరీస్ నెమరు వేసుకుంటారు. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ మూవీ బాబా మాస్టర్ కూడా ఉన్నాడు. ఆయన కామెడీ కూడా నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ఇంక తాగడం, అమ్మాయిల విషయంలో పడే గొడవలకు నవ్వి నవ్వి సచ్చిపోతారు. ఈ సినిమా పేరు ‘ది బాయ్స్’. ఈ చిత్రం 2024లోనే విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Show comments