OTT Movie Suggestion : OTTలో కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్.. ఇంకా చూడలేదా?

OTTలో కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్.. ఇంకా చూడలేదా?

OTT Movie Suggestion :చూడాలనే ఇంట్రెస్ట్, తీరిక ఉండాలే కానీ.. తెలుగులో కూడా చాలా రకాల ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అందులోను తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సిరీస్ లు ప్రేక్షకులు ఇంకాస్త ఆదరిస్తున్నారు. మరి ఈ సిరీస్ ను కానీ మీరు మిస్ అయ్యారేమో చూసేయండి.

OTT Movie Suggestion :చూడాలనే ఇంట్రెస్ట్, తీరిక ఉండాలే కానీ.. తెలుగులో కూడా చాలా రకాల ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అందులోను తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సిరీస్ లు ప్రేక్షకులు ఇంకాస్త ఆదరిస్తున్నారు. మరి ఈ సిరీస్ ను కానీ మీరు మిస్ అయ్యారేమో చూసేయండి.

ఇప్పడు వెబ్ సిరీస్ లను ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. పైగా ఓ సిరీస్ చూసి.. అది కానీ నచ్చితే.. ఇంకా ఓటీటీ లో అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటున్నారు. సిరీస్ అంటే ముందు అందరికి హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలు గుర్తోచేస్తూ ఉంటాయేమో.. ఆ సినిమాలు ఎంత బావున్నా సరే.. నేటివిటీ కి దగ్గరగా ఉండాలంటే మాత్రం తెలుగు సినిమాలను ,సిరీస్ లను చూడాల్సిందే. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ పేరు.. కరీం నగర్ మోస్ట్ వాంటెడ్. ఈ సిరీస్ ను బాలాజీ భువన గిరి దర్శకత్వం వహించగా.. రమేష్ ఎలిగేటి రైటర్ గా వ్యవహరించారు. ఇక ఈ సిరీస్ లో అమర్ సూరిపల్లి, సాయి సూరిపల్లి, అనిరుధ్ తూకుంట్ల, మేడారం గోపాల్, కట్కూరి గోవర్ధన్, తేజా కోదాటి, రాహుల్ మహేష్, వేణు పొల్సాని, శ్రీ వర్షన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సింపుల్ గా ఉన్నట్లుండి కోట్ల రూపాయలు సంపాదించాలని.. ఇప్పుడు యువత అనుకుంటూ ఉంటారు. దానికోసం బెట్టింగ్ , జూదం లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు . అలాంటి యువకులు ఎలాంటి గ్యాంగ్ స్టార్స్ గా మారారు అనేది ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ సిరీస్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. కరీంనగర్ పట్టణానికి చెందిన గని… ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. అయితే అతను తన తమ్ముడు , తన స్నేహితులతో కలిసి ఏదైనా వ్యాపారం చేయాలనీ అనుకుంటాడు. వారి దగ్గర బిజినెస్ చేయడానికి డబ్బులు లేక బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ గా మారుతారు. సరిగ్గా అదే సమయంలో.. కేంద్రం నుంచి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన వస్తుంది. దీనితో వారు 5 కోట్ల భారీ కుంభకోణంలో చిక్కుకుని జైలుకు వెళ్తారు. అసలు 5కోట్ల రూపాయల ఈ బ్యాంక్ కుంభకోణం ఏంటి ! ఆ స్కాం కు ఆ బ్యాచ్ కు ఏమైనా సంబంధం ఉందా ! జైలుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి! చివరకు వీళ్ళ కథ ఏమైంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments