OTT Releases- Anurag Kashyap Bad Cop Series: OTTలోకి హలో బ్రదర్ రేంజ్ లో.. బెస్ట్ గ్యాంగ్ వార్ సిరీస్.. ట్విస్టులు అదిరిపోతాయ్!

OTTలోకి హలో బ్రదర్ రేంజ్ లో.. బెస్ట్ గ్యాంగ్ వార్ సిరీస్.. ట్విస్టులు అదిరిపోతాయ్!

OTT New Releases- Anurag Kashyap Bad Cop Web Series: అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ అంటే మినిమం ఉంటుంది. అలాంటి అనురాగ్ ఒక గ్యాంగ్ స్టర్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

OTT New Releases- Anurag Kashyap Bad Cop Web Series: అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ అంటే మినిమం ఉంటుంది. అలాంటి అనురాగ్ ఒక గ్యాంగ్ స్టర్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈరోజుల్లో ఓటీటీ అనగానే అంతా సినిమాలు అనుకుంటారు. కానీ, వెబ్ సిరీస్లకు అలవాటు పడితే మాత్రం అస్సలు వదలలేరు. ఎందుకంటే సరైన సిరీస్ తగిలితే మాత్రం పూర్తి చేసే వరకు నిద్ర కూడా పోలేరు. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. అది కూడా సూపర్ అంటే సూపర్ యాక్షన్ డ్రామాతో. మీరు తెలుగులో నాగార్జున హలో బ్రదర్ సినిమా చూసే ఉంటారు. అందులో నాగార్జున ట్విన్స్ గా చేస్తారు. ఒకరు దొంగ అయితే.. ఒకరు మాత్రం మ్యూజీషియన్. ఇక్కడ ఒకరు దొంగ అయితే.. ఇంకొకరు పోలీస్ అనమాట. ఇద్దరిలో ఎవరు దొంగో? ఎవరు పోలీస్ అనే విషయాన్ని కట్టుకున్న వాళ్లు కూడా కనిపెట్టలేరు.

సాధారణంగా గ్యాంగ్ వార్ అంటే.. ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. కానీ, ఈ సిరీస్లో మాత్రం అదిరిపోయే డ్రామా పెట్టారు. అలాగే ఒక్కో ట్విస్టుకు బుర్ర తిరిగిపోయేలా కథను ప్లాన్ చేశారు. ఈ సిరీస్ ట్రైలర్ చూస్తేనే మీకు పిచ్చెక్కిపోతుంది. అరె ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ వెతికేస్తారు. అయితే ఈ సిరీస్ లో అదిరిపోయే ఒక పాయింట్ ఉంది. కవలల్లో ఒకరు దొంగ, ఒకరు పోలీస్. అయితే వాళ్లు ఒక పెద్ద సమస్యలో పడతారు. డిపార్టుమెంట్ మాత్రమే కాకుండా.. గ్యాంగ్ స్టర్స్ కూడా వారిపైకి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు అన్నదమ్ములు కరణ్- అర్జున్ ఎలా తప్పించుకున్నారు? జనాలను ఎలా మాయ చేశారు అనేదే పాయింట్. ఈ కథ మీకు కాస్త రొటీన్ గా అనిపించవచ్చు. ఎందుకు అంటే టాలీవుడ్ లో వచ్చిన నాయక్ కథ కూడా మోడ్రన్ హలో బ్రదర్ అని చెప్పాలి.

అయితే కథ కాస్త రొటీన్ గా అనిపించినా కూడా.. ట్విస్టులు మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కి కూడా మంచి మార్కులు పడతాయి. ఎందుకంటే ఈ సిరీస్లో మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే లీడ్ క్యారెక్టర్స్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే విలన్ గా చేసిన అనురాగ్ కశ్యప్.. హీరోగా చేసిన గుల్షన్ దేవయ్యల యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ముఖ్యంగా రెండు డిఫరెంట్ రోల్స్ ప్లే చేసిన గుల్షన్ దేవయ్యను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వేరు వేరు బాడీ ల్యాంగ్వేజ్, వేరు వేరు డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ అంతా కొత్తగా ఉంటుంది. ఇంక అనురాగ్ కశ్యప్ విలనిజం అయితే అదిరిపోతుంది అని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతోంది. ఈ సిరీస్ ని జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Show comments