OTT Releases This Week- Human Web Series: ఒక్క ఇంజక్షన్.. కోట్ల వ్యాపారం.. వందల ప్రాణాలు.. OTTలో బెస్ట్ మెడికల్ మాఫియా సిరీస్!

ఒక్క ఇంజక్షన్.. కోట్ల వ్యాపారం.. వందల ప్రాణాలు.. OTTలో బెస్ట్ మెడికల్ మాఫియా సిరీస్!

OTT Movies This Week- Best Action Drama Human: ఓటీటీలో మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే.. వెంటనే ఈ సిరీస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ వెబ్ సిరీస్. మెడికల్ మాఫియాలో ఉన్న ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సిరీస్ ఇది. స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం కష్టం.

OTT Movies This Week- Best Action Drama Human: ఓటీటీలో మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే.. వెంటనే ఈ సిరీస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ వెబ్ సిరీస్. మెడికల్ మాఫియాలో ఉన్న ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సిరీస్ ఇది. స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం కష్టం.

ఓటీటీలో కొన్ని సిరీస్లు చూస్తే వావ్ అనిపిస్తుంది. కానీ, కొన్ని సిరీస్లు చూస్తే మాత్రం వామ్మో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూపించే కథలు మనం నిజ జీవితంలో చూసినట్లే ఉంటాయి. ఒకవేళ నిజంగానే అలా మన దగ్గర జరుగుతోందా అనే కంగారు పుడుతుంది. అలాంటి ఒక సిరీస్ నే మీకోసం తీసుకొచ్చాం. ఈ సిరీస్ చూస్తే మీరు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. మెడికల్ మాఫియా.. మెడికల్ మాఫియా అని మీరు వింటూ ఉంటారు. కానీ, అది ఎలాఉంటుందో ఎవరికీ తెలీదు. కానీ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఇంత క్రూరంగా ఉంటారా? మనుషుల ప్రాణాలు అంటే అంత లోకువా అనే ప్రశ్నలు వస్తాయి. ఈ సిరీస్ చూస్తే ముందు బయట ఒక్క ఇంజక్షన్ చేయించుకోవాలి అంటే అల్లాడిపోతారు.

సాధారణంగా మెడికల్ రంగం, మెడిసిన్స్, వాటిని తయారు చేసే సంస్థలు లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్లలేదు. అలాంటి ఒక వైద్య రంగంలో ఎన్నో చీకటి కోణాలు, దారుణమైన మనుషులు ఉంటారు. అలాంటి పాయింట్ నే ఈ సిరీస్ హైలెట్ చేసింది. ఇందులో అంతా డాక్టర్ లైఫ్.. ఒక ఫార్మాసూటికల్ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా అధికారికంగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు ఎలుకలు, కోతులు, చింపాజీల మీద డ్రగ్ టెస్ట్ చేయాలి. కానీ, ఇక్కడ మాత్రం మనుషులను బోన్లలో ఎలుకల మాదిరి పెట్టి.. వారిపై కొత్త ఇంజెక్షన్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

వాళ్ల హ్యూమన్ ట్రయల్స్ కోసం ఇంజక్షన్ తీసుకుంటే రూ.10 వేలు ఇస్తామంటూ ఆశచూపించి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు. మొదట అంతా బాగానే ఉంటుంది. కానీ, ఒక్క వారంలో అంతా మారిపోతుంది. ఆ ఇంజక్షన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్ ఘోరంగా వస్తాయి. వారు నోరు తెరిస్తే వీళ్ల కంపెనీ మనుగడ ఉండదు. అందుకే వారిని దారుణంగా చంపేస్తారు. వారి కంపెనీని నిలబెట్టుకోవడానికి సొగసు వల కూడా విసురుతారు. ఇద్దరు మహిళలు.. కాదు కాదు ఇద్దరు మహిళా డాక్టర్స్ కలిసి ఇదంతా చేస్తున్నారు అంటే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. వాళ్లు కోట్లు గడించడం కోసం అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు.

ఈ సిరీస్ లో ఇది మెయిన్ పాయింట్ మాత్రమే. ఈ పాయింట్ చుట్టూ తిరిగే కథ, రాజకీయం, అమాయకుల బతుకులు చాలానే కాన్ ఫ్లిక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఈ సిరీస్ పేరు ‘హ్యూమన్’. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 55 నిమిషాల వరకు ఉంటుంది. ఇది తొలి సీజన్ మాత్రమే. ఇంకా ఎన్ని సీజన్స్ వస్తాయో కూడా చెప్పలేం. ఎందుకంటే మెడికల్ మాఫియా అంటే చిన్న పాయింట్ కాదు. కథను ఎన్ని మలుపులు అయినా తిప్పచ్చు. ఈ సిరీస్ లో యాక్షన్, ఎమోషన్, క్రూయాలిటీ, కన్నింగ్ అన్నీ కోణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Show comments