OTT Best Sci-Fi Movie: ఆ బీచ్ కెళ్తే ప్రాణాలతో రారు.. OTTలో ఈ మూవీకి నరాలు తెగిపోతాయ్!

OTT Best Sci-Fi Movie: ఆ బీచ్ కెళ్తే ప్రాణాలతో రారు.. OTTలో ఈ మూవీకి నరాలు తెగిపోతాయ్!

OTT Movie Suggestion: కొన్ని సినిమాలను చూస్తే.. ఇన్ని రోజులు ఈ సినిమా చూడకుండా ఎలా మిస్ అయిపోయాం అని.. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన సినిమాలలో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: కొన్ని సినిమాలను చూస్తే.. ఇన్ని రోజులు ఈ సినిమా చూడకుండా ఎలా మిస్ అయిపోయాం అని.. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన సినిమాలలో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

హర్రర్, సస్పెన్స్, రొమాంటిక్ జోనర్ లో వచ్చే చిత్రాలు ప్రేక్షకులకు చూసేందుకు బాగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ అప్పుడపుడు వాటి నుంచి బ్రేక్ తీసుకుని… సైన్స్ ఫిక్షన్ డ్రామాలను చూడడానికి కూడా ప్రేక్షకులు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలైతే.. అందరు ఎప్పటికప్పుడు మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఉన్న కొన్ని సినిమాలను మాత్రం ప్రేక్షకులు మిస్ చేస్తూ ఉంటారు. ఎపుడైనా ఎవరైనా సజ్జెస్ట్ చేసినప్పుడు ఈ సినిమాను ఎలా మిస్ చేసాం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే . మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. సాధారణంగా బీచ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందరు సరదాగా ఫ్యామిలితో కలిసి బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడైనా బీచ్ కు వెళ్తే.. వయస్సు పెరిగిపోవడం చూశామా.. అదేంటి బీచ్ కు వెళ్తే వయస్సు పెరిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా.. వినడానికి కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్ ఏ ఈ మూవీ కథ. ఈ సినిమాలో గయ్, ప్రిస్క అనే భార్య భర్తలు.. వారి పిల్లలు ట్రెంట్, మాడెక్స్ తీసుకుని.. ఓ హాలీడే ట్రిప్ కు వెళ్తారు. వారు వెళ్లిన రిసార్ట్ కు దగ్గరలోనే ఓ బీచ్ ఉందని అక్కడి వారు చెప్పడంతో.. ఈ కుటుంబంతో పాటు మరో రెండు కుటుంబాలు కూడా వీరితో కలిసి బీచ్ కు వెళ్తాయి. అక్కడకు వెళ్లిన తర్వాత.. గయ్ కొడుకు ట్రెంట్ కు ఆ బీచ్ లో ఓ డెడ్ బాడీ కనిపిస్తుంది. దానిని చూసి అంతా భయపడిపోతారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు మిడ్ అనే వ్యక్తి వచ్చి.. అది తన ఫ్రెండ్ అని చెప్తాడు. దీనితో ఆ బీచ్ కు వచ్చిన డాక్టర్ చార్ల్ కు మిడ్ పైన అనుమానం వస్తుంది . సరిగ్గా అదే టైమ్ కి చార్ల్ తల్లి చనిపోతుంది. ట్రెంట్ , మాడెక్స్ ఇద్దరు ఒక్కసారిగా పెద్ద వాళ్ళు అయిపోతారు.

ఉన్నట్లుండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్ధం కాదు. ఇదంతా ఆ బీచ్ కు వెళ్లడం వలెనే జరుగుతుందని వారంతా అర్థంచేసుకుని.. అక్కడ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన ప్రతి సారి వారికి ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఆ బీచ్ కు వెళ్లిన వారంతా ఒక్కరిగా చనిపోతూ ఉంటారు. ట్రెంట్ , మాడెక్స్ మాత్రమే ఆ బీచ్ లో ఒంటరిగా మిగిలిపోతారు. సరిగ్గా అప్పుడే సముద్రం కింద భాగానికి వెళ్ళి తప్పించుకునే మార్గం ఉందని తెలుసుకుంటారు. వాళ్ళు ఆ బీచ్ నుంచి బయటపడ్డారా లేదా ! అసలు బీచ్ కు వెళ్తే వయస్సు పెరగడం ఏంటి ! దీని వెనుక ఉన్న కథేంటి ! ఇవన్నీ తెలియాలంటే.. “ఓల్డ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments