Best Feel Good Movie In OTT: OTTలో ఫీల్ గుడ్ మూవీ.. మిస్ అయితే మాత్రం తప్పకుండా చూసేయండి..!

OTTలో ఫీల్ గుడ్ మూవీ.. మిస్ అయితే మాత్రం తప్పకుండా చూసేయండి..!

Best Feel Good Movie In OTT: ఓటీటీ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి మంచి రెఫ్రెషింగ్ మూవీ మాత్రం ఇప్పటివరకు చూసి ఉండరు. పైగా ఇది ఒక తెలుగు సినిమానే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Feel Good Movie In OTT: ఓటీటీ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి మంచి రెఫ్రెషింగ్ మూవీ మాత్రం ఇప్పటివరకు చూసి ఉండరు. పైగా ఇది ఒక తెలుగు సినిమానే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో ఈ వారం బాగానే మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాలను చూసేసి ఇంకా ఏమైనా మంచి కథలు ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మీకోసమే. ఇప్పటివరకు ఓటీటీ లో అనేక చిన్న చిన్న కథలతో వచ్చిన సినిమాలను చాలానే చూసి ఉంటారు. ఆ సినిమాలు చూస్తుంటే మంచి రెఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే. ఇలాంటి సినిమాలను దాదాపు ఎవరు మిస్ చేయకుండా ఉండరు. కానీ ఇంకా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

దాదాపు చాలా వరకు ఫీల్ గుడ్ సినిమాలన్నీ కూడా తమిళ వెర్షన్ నుంచి డబ్బింగ్ చేసినవో.. లేక రీమేక్ చేసినవో ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే.. ఈ సినిమా సిల్లు కరుప్పత్తి అనే తమిళ సినిమా నుంచి రీమేక్ అయ్యి.. తెలుగులో.. నారింజ మిఠాయి అనే పేరుతో రిలీజ్ అయింది. ఇది ఒక ఆంథాలజీ ఫిల్మ్. సాధారణంగా ఇలాంటి ఫిల్మ్స్ కు ఎన్ని స్టోరీస్ ఉంటె అంత మంది దర్శకత్వం వహిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్కడే దర్శకుడు ఉన్నాడు. అసలు ఏంటి ఈ ఆంథాలజీ మూవీ.. దీనిలో ఉండే కథలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. మనసుకు హాయి కలిగించే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమాను మిస్ అయినట్లే.

ఈ సినిమాలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథ “పింక్ బ్యాగ్”. ఓ గార్బేజ్ యార్డ్ లో చెత్త ఏరుకునే మాంజా అనే ఓ కుర్రాడికి చెందిన కథ ఇది. ఆ చెత్త కుప్పలో పడి ఉన్న పింక్ బ్యాగ్ లోని వస్తువులను కలెక్ట్ చేయడం మాంజాకి ఓ అలవాటుగా మారిపోతుంది. ఓసారి ఆ బ్యాగ్ లో వాక్ మేన్ లభిస్తుంది. మరోసారి ఉంగరం కనిపిస్తుంది. ఆ ఉంగరం ఎవరిదో తెలుసుకుని, మాంజా దానిని ఎలా తిరిగి ఇచ్చాడనేది మొదటి కథ. ఇక రెండవ కథ “కా కా గాడి”.. ఇది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ .. సరదాగా మీమ్స్ క్రియేట్ చేసే ఓ కుర్రాడికి సంబంధించిన కథ. పెళ్లి ఫిక్స్ అయినా తర్వాత అతనికి క్యాన్సర్ వస్తుంది. దీనితో అనుకున్న పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ఓ అమ్మాయి పరిచయం అవ్వడం.. ఆమె ద్వారా ఇతను ఎలా మారాడు అన్నదే రెండవ కథ.

ఇక మూడవ కథ.. “టర్టిల్”. ఎనిమిదేళ్ళ క్రితం తన భార్య చనిపోవడంతో ఒంటరి తనం అనుభవిస్తుంటాడు ప్రకాష్. అతనికి కెరీర్ కారణంగా 55 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకొని ఓ మహిళకు మధ్య ఏర్పడ్డ పరిచయం .. ఎలా ముందుకు సాగింది అనేదే మూడవ కథ. ఇక నాలుగవ కథ “హే అమ్ము”… జీవితం రొటీన్ అయిపోతే.. మహిళలు ఎలాంటి బాధలు పడతారు అనేదే ఈ నాలుగవ కథ ప్లాట్ . ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా ఎంతో అద్భుతంగా చూపించారు మేకర్స్. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments