OTT Best Investigation Thriller: పిల్లల కోసం యువతి పోరాటం.. OTTలో ఈమె తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

పిల్లల కోసం యువతి పోరాటం.. OTTలో ఈమె తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

OTT Movie Suggestion- Best Investigation Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి తెలుసుకుంటే మాత్రం .. ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాం అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉంటే మాత్రం మరొక్కసారి చూసినా తప్పులేదని అనిపిస్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Movie Suggestion- Best Investigation Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి తెలుసుకుంటే మాత్రం .. ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాం అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉంటే మాత్రం మరొక్కసారి చూసినా తప్పులేదని అనిపిస్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లెర్స్ అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. పెర్టిక్యులర్ గా ఈ సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి తెలుసుకుంటే మాత్రం .. ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాం అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉంటే మాత్రం మరొక్కసారి చూసినా తప్పులేదని అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసిన తప్పు లేదని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా బహుశా ఈ కోవలోకి వస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

అసలు ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటో చూసేద్దాం.. వైశాలి సింగ్ అనే యువతి.. బాగా నిజాయితీ గల ఓ జర్నలిస్ట్. బయట మీడియా సంస్థలలో వారు చెప్పినట్లు చేయడం ఇష్టంలేక.. తానే కోశిష్ న్యూస్ అనే ఓ న్యూస్ ఛానల్ ను నడుపుతుంటుంది. ఆమెకు కెమెరా మ్యాన్ గా భాస్కర్ సిన్హా అనే వ్యక్తి ఉంటాడు. వారిద్దరూ కలిసి పాట్నాలో జరుగుతున్న వార్తలను చెబుతూ ఉంటారు. మరో వైపు.. పాట్నాలోని మునావర్‌పూర్‌లో ఓ సాంఘిక సంక్షేమ శాఖ.. హాస్టల్ లో అనాధ బాలికల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ, ఈ విషయాలను అక్కడ ప్రభుత్వం పట్టించుకోదు. దానికి కారణం ఆ హాస్టల్ ను బన్సీ సాహు అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. అతనికి మూడు పాపులర్ న్యూస్ ఛానెల్స్ తో పాటు.. అక్కడ రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి.

కాబట్టి.. అతనిని ఎవరు టచ్ చేయలేరు.. అలాగే ఆ హాస్టల్ పైన ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోరు. ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతుందో.. వైశాలి దగ్గరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది తెలుకున్న తర్వాత వైశాలి ఏం చేసింది ! రాజకీయ నాయకులతో పరిచయం ఉన్న బన్సీ సాహూపై ఎలా పోరాడింది ! వైశాలి తో పాటు ఆమె కుటుంబానికి కూడా ఏదైనా ఇబ్బంది కలిగిందా! ఆ బాలికలను వైశాలి కాపాడిందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “భక్షక్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఎక్కువ వల్గారిటీ లేకుండా అక్కడ అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను బాగా ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటి భూమి పెడ్నేకర్.. వైశాలి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments