OTT Best Sentimental Movie: OTT లో బెస్ట్ బ్రదర్ సెంటిమెంట్ మూవీ.. ఫ్యామిలీతో చూసేయచ్చు!

OTT లో బెస్ట్ బ్రదర్ సెంటిమెంట్ మూవీ.. ఫ్యామిలీతో చూసేయచ్చు!

OTT Best Sentimental Movie: కొన్ని సినిమాలు చూస్తే.. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఎక్కడ ఓ దగ్గర మాత్రం ఓ ఎమోషనల్ పాయింట్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

OTT Best Sentimental Movie: కొన్ని సినిమాలు చూస్తే.. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఎక్కడ ఓ దగ్గర మాత్రం ఓ ఎమోషనల్ పాయింట్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

హర్రర్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అనే వేటలో పడిపోయి.. మంచి తెలుగు ఫీల్ గుడ్ మూవీస్ ను మిస్ అయిపోతున్నారు ప్రేక్షకులు. ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ చూసేసాం అని ఫీల్ అయిపోయి రిలాక్స్ అయిపోయే ప్రేక్షకులకు.. ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయంటూ గుర్తు చేస్తూ ఉంటాయి.. కొన్ని సినిమాలు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఆల్రెడీ ఈ సినిమాను చాలా మంది చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఓ మంచి ఎమోషనల్ మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమాలో నటి నటులు కూడా అందరికి పరిచయం ఉన్న వారే.. అసలు ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు. ఈ సినిమా కథ గురించి చూసేద్దాం. ఈ మూవీలో ప్రియ అనే మహిళ తన భర్తను కోల్పోతుంది. అప్పటికే ఆమె గర్భవతిగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో భర్త చనిపోవడంతో .. కుటుంబ భారమంతా ప్రియపైనే పడుతుంది. తన అత్తతో కలిసి ఉంటూ.. టైలరింగ్ చేసుకుంటూ.. ఆ వచ్చే డబ్బులతో జీవితం సాగిస్తూ ఉంటుంది. మరో వైపు అల్లరి చిల్లరగా భాద్యతరహితంగా ప్రవర్తించే కుర్రాడు అభి. ఓ సారి ప్రియా తన భర్త కంపెనీ ఇచ్చే పరిహారం కోసం .. ఆ కంపెనీకి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో లిఫ్ట్ లో అభి ని కలుస్తుంది. అభి అల్లరి చిల్లరగా ఉండడంతో.. మొదటి సారే అతనిని అసహ్యించుకుంటుంది. కట్ చేస్తే ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోతుంది . దీనితో వారిద్దరూ ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. సరిగ్గా అదే సమయంలో ప్రియకు పురిటి నొప్పులు వస్తాయి.

ఆ తర్వాత ఏం జరిగింది ! అల్లరి చిల్లరగా తిరిగే అభి ఆ సమయంలో బాధ్యతగా ప్రవర్తించాడా లేదా ! ప్రియ భర్త అసలు ఎలా మరణించాడు ! ప్రియ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ! ఇవన్నీ తెలియాలంటే “థాంక్యూ బ్రదర్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రియ పాత్రలో నటించింది మరెవరో కాదు అనుసయా భరద్వాజ్. అలాగే అభి పాత్రలో నటించింది.. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్. వీరితో పాటు.. ఆదర్శ్ బాలకృష్ణ, మౌనిక రెడ్డి, అర్చన అనంత్ కూడా ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఒక చిన్న పాయింట్ ను చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments