OTT Suggestions- Best Revenge Drama Out Of Love: సెక్రెటరీతో భర్త అక్ర*మ సంబంధం.. OTTలో ఈ భార్య రివేంజ్ కి వణికిపోతారు!

సెక్రెటరీతో భర్త అక్ర*మ సంబంధం.. OTTలో ఈ భార్య రివేంజ్ కి వణికిపోతారు!

OTT Movie Suggestions- Best Revenge Drama: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలు ఒకెత్తు. ఈ వెబ్ సిరీస్ మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ కి మీకు ఫ్యూజుల్ అవుట్ అవుతాయి. భార్య రివేంజ్ తీర్చుకుంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని నోరెళ్లబెడతారు.

OTT Movie Suggestions- Best Revenge Drama: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలు ఒకెత్తు. ఈ వెబ్ సిరీస్ మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ కి మీకు ఫ్యూజుల్ అవుట్ అవుతాయి. భార్య రివేంజ్ తీర్చుకుంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని నోరెళ్లబెడతారు.

ఈ సమాజాన్ని, వివాహ వ్యవస్థను, దాంపత్య జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే.. అది సక్రమం కాని సంబంధం అనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. పొద్దున లేస్తే వార్తల్లో కూడా ఇవే పంచాయితీలు. అలాంటప్పుడు సినిమాలు కూడా దాదాపుగా అలాంటి కథల మీదే వస్తాయి. ఎందుకంటే సినిమా అంటే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురాదు. మన జీవితాలనే సినిమాలుగా తెరకెక్కిస్తారు. అందుకే ఇప్పుడు ఇలాంటి కథలకు కూడా మంచి డిమాండ్ ఉంది. అదే కోవకు చెందిన ఒక రివేంజ్ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ దెబ్బకు ఆడియన్స్ పిచ్చోళ్లు అయిపోతారు.

సాధారణంగా దాంపత్య జీవితం సక్రమంగా సాగడం లేదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కాపురం రెండు సందర్భాల్లో దెబ్బతింటుంది. ఒకటి భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు. రెండోది కూడా గొడవలు జరిగినప్పుడే అవుతుంది. ఎందుకంటే ఆ గొడవలు ముఖ్యంగా రెండు కారణాల వల్ల జరుగుతాయి. ఒకటి పరా వ్యక్తి కోసం పాకులాడుతున్నప్పుడు. దాదాపుగా రెండో కారణం కూడా అదే అవుతుంది. ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చినప్పుడు. ఈ సిరీస్ లో కూడా అదే జరుగుతుంది. చక్కగా సాగిపోతున్న కాపురం. రత్నంలాంటి కుమారుడు.

ఆ భర్త బుద్ధి బెడదోవ పడుతుంది. తన దగ్గర సెక్రటరీగా చేసే యువతితో ఆ భర్త రిలేషన్ పెట్టుకుంటాడు. ఆ విషయాన్ని ఓ రోజు భార్య కనిపెడుతుంది. భర్త స్కార్ఫ్ లో దొరికిన ఒక వెంట్రుకతో ఆమె ఆ విషయాన్ని కన్ఫామ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వారిని రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకుంటుంది. ఆ సమయంలో ఆ భార్యకు ఏం చేయాలో తెలియక భర్తను వదిలేసి వెళ్లిపోతుంది. అయితే వెళ్లే ముందు అతని నిజ స్వరూపాన్ని అందరికీ చూపించి వెళ్లిపోతుంది. అక్కడితో మొదటి సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత రెండో సీజన్లో అసలు రివేంజ్ డ్రామా కొనసాగుతుంది. ఆ భర్త తిరిగి కూనూరుకు వస్తాడు.

ఈసారి మాజీ భర్త కొత్త భాగస్వామి(మీనాక్షి చౌదరి)తో రిటర్న్ వస్తాడు. అయితే ఈసారి తన మాజీ భార్య మీద పగ తీర్చుకోవాలి అనేది అతని మోటో. అలాగే తన కుమారుడిని తాను సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే రెండోసారి ఆ భార్య గెలిచిందా? తన కుమారుడిని కాపాడుకుందా? తిరిగివచ్చి ఆ భర్త తప్పు చేశాడా? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో కథ సాగుతుంది. ఈ కథ దాదాపుగా రియల్ లైఫ్స్ కి దగ్గరగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘అవుట్ ఆఫ్ లవ్‘. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం రెండు సీజన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడం చాలా కష్టం.

Show comments