OTT Best Murder Mystery: బెస్ట్ థ్రిల్లింగ్ మిస్టరీ మూవీతో.. OTTని షేక్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్!

బెస్ట్ థ్రిల్లింగ్ మిస్టరీ మూవీతో.. OTTని షేక్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్!

OTT Best Murder Mystery: మర్డర్ మిస్టరీస్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. ఈ జోనర్ లో సినిమాలంటే ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటి జోనర్ కు చెందిందే. ఈ సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Murder Mystery: మర్డర్ మిస్టరీస్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. ఈ జోనర్ లో సినిమాలంటే ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటి జోనర్ కు చెందిందే. ఈ సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

కొన్ని సినిమాల గురించి విన్న తర్వాత.. ఇలాంటి సినిమాలను ఎలా మిస్ చేసాం.. అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాదాపు ఓటీటీ లోకి వచ్చేసిన సినిమాలన్నీ చూసేసిన కానీ.. ఇంకా చూసేందుకు పదుల సంఖ్యలో మిగిలిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఏదైనా సినిమా గురించి ఎక్కడైనా చూసినప్పుడు.. దాని కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలంటే.. ప్రతి ఒక్కరికి బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ సినిమా కూడా ఈ కోవకు చెందినదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు దాదాపు భాష బేధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమాను కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ సినిమాలో మలయాళ నటి నయన తార మెయిన్ లీడ్ లో నటించింది. బేసిక్ గా నయన తార మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి అయినా సరే.. తమిళ, తెలుగు సినిమాలనే ఎక్కువగా చేసింది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం మలయాళ సినిమానే.. ఈ సినిమా మీరు “నిళల్”. ఇది కేవలం మళయాళంలోనే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను “నీడ ” అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఇదొక మర్డర్ మిస్టరీ మూవీ.. కానీ చూస్తున్నపుడు హర్రర్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. అదేంటి అనిపిస్తుందా.. అసలు కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

 

అసలు ఏంటి ఈ సినిమా అనే విషయానికొస్తే.. జాన్ బేబీ అనే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్.. అనుకోకుండా జరిగిన కార్ యాక్సిడెంట్ లో అతను తీవ్రంగా గాయపడతాడు.. ఆ దెబ్బల నుంచి కోలుకున్నా కూడా.. మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఇక మరో వైపు.. నయన తార సింగల్ మదర్.. తన కొడుకు నితిన్ తో కలిసి ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి వైజాగ్ కు వస్తుంది. తన కొడుకు నితిన్ స్కూల్ లో పిల్లలకు క్రైమ్ స్టోరీలు చెబుతూ ఉంటాడు. దీనితో అతనికి ఎదో డిసీజ్ ఉందని.. ఓ చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. జాన్ బేబీ ఆ చైల్డ్ స్పెషలిస్ట్ కు ఫ్యామిలీ ఫ్రెండ్. దీనితో నితిన్ విషయాన్నీ జాన్ బేబీతో చెప్తుంది ఆ డాక్టర్. ఆ యాక్సిడెంట్ తర్వాత తన ప్రవర్తనకు.. నితిన్ ప్రవర్తనకు ఏదైనా సంబంధం ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. దీనితో ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని అనుకుంటూ ఉంటాడు. నితిన్ చెప్పే క్రైమ్ కథలను అతను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. అసలు వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి ! ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన హత్యల గురించి ఇప్పుడు ఎందుకు బయటపడ్డాయి ! అసలు ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Show comments