10th,ITI పాసైతే చాలు.. సింగరేణిలో జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

10th,ITI పాసైతే చాలు.. సింగరేణిలో జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

మీరు టెన్త్, ఐటీఐ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు టెన్త్, ఐటీఐ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 1,2,3,4 ద్వారా పలు జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. మరోవైపు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. మీరు టెన్త్, ఐటీఐ పాసైతే చాలు సింగరేణిలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఇలాంటి జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోయినట్టే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్‌ 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

1. ఎగ్జిక్యూటివ్ కేడర్ – 49

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ అండ్‌ ఎం), ఇ2 గ్రేడ్:

  • 42

మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్:

  • 07

2. నాన్-ఎగ్జిక్యూటివ్ (ఎన్‌సీడబ్ల్యూఏ) కేడర్ – 278

జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:

  • 100

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:

  • 09

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:

  • 24

ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I:

  • 47

ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I:

  • 98

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 15-05-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 29-06-2024
Show comments