BTech పాసయ్యారా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. నెలకు 1,40,000 జీతం

BTech పాసయ్యారా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. నెలకు 1,40,000 జీతం

బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి.

బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు బీటెక్ ఉత్తీర్ణులైతే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా ఐటీ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలుగా మారాయి. కొత్త రిక్రూట్ మెంట్స్ కూడా ఆగిపోయాయి. దీంతో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలో బీటెక్ పాసైన వారికి ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. తాజాగా ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

బీటెక్ చేసి ఖాళీగా ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ లో 158 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోస్టులను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంబీఏ పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూలై 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల సంఖ్య:

  • 158

విభాగాలవారీగా ఖాళీలు:

  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కెమికల్): 51
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మెకానికల్‌): 30
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌): 27
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 18
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్): 04
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఫైర్): 02
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సీసీ ల్యాబ్‌): 01
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌): 03
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌): 10
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హ్యూమన్‌ రిసోర్సెస్-HR): 05
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్): 04
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్): 03

అర్హత:

  • సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్‌డీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • రాతపరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైనవారికి శిక్షణ సమయంలో నెలకు రూ.30,000, ఏడాది శిక్షణ పూర్తైన తర్వాత ఈ1 గ్రేడ్ కింద రూ.40,000-1,40,000 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 08-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 01-07-2024
Show comments