డీగ్రీ, BTech పాసయ్యారా? ఈ Bank జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి

డీగ్రీ, BTech పాసయ్యారా? ఈ Bank జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి

బ్యాంకు జాబ్స్ కోసం సన్నద్ధమయ్యేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డీగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు జాబ్స్ కోసం సన్నద్ధమయ్యేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డీగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంకు భారీ స్థాయిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇటీవల ఐబీపీఎస్ భారీస్థాయిలో బ్యాంకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 10 వేల బ్యాంకు ఉద్యోగాలు భర్తీకానున్నాయి. బ్యాంకు జాబ్స్ లక్ష్యంగా పెట్టుకన్న వారికి ఇదే మంచి అవకాశం. మరి మీరు కూడా బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? మీరు డిగ్రీ, బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా 627 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిసి మొత్తం 627 ఖాళీలు ఉన్నాయి. రెగ్యూలర్ ప్రాతిపదికన 168 పోస్టులను, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 459 పోస్టులను భర్తీ చేయనున్నది. పోస్టులను నుసరించి డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 12న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో జూలై 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 627

అర్హత:

  • గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ, బీటెక్ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి  25 నుంచి 50 ఏళ్లు కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

  • బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూలో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 02-07-2024
Show comments