కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం.. ఈ అర్హతలుండాలి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం.. ఈ అర్హతలుండాలి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.

డిగ్రీలు చదివినా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో జాబ్ పొందడం గగనమైపోతున్నది. గవర్నమెంట్ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా లక్షలాది మంది పోటీపడుతుంటారు. మంచి జీతంతో పాటు సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువ. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. తాజాగా ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ గ్రేడ్- ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్‌, లీగల్‌, ఐటీ, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, రీసెర్చ్‌ అండ్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌/పీజీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

ఆఫీసర్ గ్రేడ్- ఏ (అసిస్టెంట్ మేనేజర్): 97 

స్ట్రీమ్:

  • జనరల్- 62, లీగల్- 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2, రిసెర్చ్- 2, అఫీషియల్‌ లాంగ్వేజ్‌- 2 పోస్టులున్నాయి.

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌/పీజీ పూర్తి చేసి ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి:

  • 31.03.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం, ఇతర సౌకర్యాలతో కలిపి నెలకు దాదాపు రూ.1,49,500 (అకామిడేషన్‌ లేకుండా); అకామిడేషన్‌తో అయితే నెలకు రూ.₹1,11,000 చొప్పున అందుతుంది.

దరఖాస్తు ఫీజు:

  • అన్‌రిజర్వ్‌డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ వారికి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 30-06-2024
Show comments