బ్యాంక్ జాబ్ మీ లక్ష్యమా? డిగ్రీ పాసైతే చాలు.. 3 వేల Bank జాబ్స్ రెడీ

బ్యాంక్ జాబ్ మీ లక్ష్యమా? డిగ్రీ పాసైతే చాలు.. 3 వేల Bank జాబ్స్ రెడీ

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన వారు వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన వారు వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. వంద, రెండు వందలు కాదు ఏకంగా 3 వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులైతే మీకు ఇదే మంచి సువర్ణావకాశం. మళ్లీరాని ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ బ్యాకు 3,000 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

అయితే ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. తాజాగా మళ్లీ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మరికొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ రిక్రూట్ మెంట్ టెస్ట్ జూన్ 23న జరుగనున్నది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.      అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి ఉండాలి. 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి:

  • 1996 ఏప్రిల్ 1 నుంచి 2004 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉండాలి.

స్టైఫండ్:

  • ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్‌ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఏవీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్, మహిళా అభ్యర్థులు రూ.600 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 17-06-2024
Show comments