Onion Prices: సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. అప్పటి వరకు ఇదే పరిస్థితి!

Onion Prices: సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. అప్పటి వరకు ఇదే పరిస్థితి!

దేశ వ్యాప్తంగా  ఉల్లిధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అందుకు గల కారణం..

దేశ వ్యాప్తంగా  ఉల్లిధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అందుకు గల కారణం..

నేటికాలంలో సామాన్యులకు నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఫలాన వస్తువు అని కాకుండా ప్రతి దాని ధర ఎక్కువగా ఉంటుంది.  దీంతో మధ్యతరగతి కుటుంబ వాళ్లు కొనలేక, అలా అని కొనకుండా ఉండలేక మధ్యలో నరకం అనుభవిస్తున్నారు. కూరగాయల ధరలు కూడా సామాన్యుడిని ఏడిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టమాట ధరలు, ఉల్లిధరలు కొండెక్కి కూర్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఉల్లి ధరలు అయితే కొనకుండానే సామాన్యుడికి కన్నీరు పెట్టిస్తున్నాయి. మరి..ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా  ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రోజు ఉల్లిగడ్డలు కొనుగోలు చేసే వారు ఆందోళన చెందుతుండే.. ఎప్పుడు వెళ్లకుండా సడెన్ గా ఉల్లిగడ్డలు కొన్నేందుకు వెళ్లిన వారు వాటి ధరలు చూసి..షాకవుతున్నారు. అంతేకాక  వీటి ధరలు కొనకముందే కన్నీరు పెట్టిస్తున్నాయని వాపోతున్నరు. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. మార్కెట్ లో ఉల్లి సరఫరా బాగా తగ్గడమేనని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లిని ఎక్కువ ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా వీటి ఉత్పత్తిలో భారీగా లోటు ఉందని చెబుతున్నారు. అంతేకాక మిగిలిన పలు ప్రాంతాల్లో కూడా ఉల్లి ఉత్పత్తి కాస్తా తగ్గింది. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధర ఏకంగా 30 నుంచి 50 శాతం పెరిగింది.

ఇదే సమయంలో కొంరు వ్యాపారులు తమ పాడుబుద్ది చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి సప్లయ్ తక్కువగా ఉంటే..వారు ఉన్నవాటిని కూడా నిల్వ చేసి.. ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తోన్నాయి. ఇక హైదరాబాద్‌ నగరంలో ఉల్లి ధరల విషయానికి వస్తే.. రిటైల్ ధర సుమారు 25 శాతం, హోల్‌సేల్ ధర 15 శాతం పెరిగింది.  కొన్ని రోజుల క్రితం వరకు  20 నుంచి 30 మధ్య ఉన్న ఉల్లి ధరలు ప్రస్తుతం  ఏకంగా కిలోకు రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉంది.

నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు.. సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేక పోవడంతో ఉల్లి మరింత పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉల్లిని ఎక్కువ ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని 27 జిల్లాలలో 20 నుంచి 45 శాతం వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని గణంకాలు సూచిస్తున్నాయి. లోటు తీరితే.. ఉల్లి ఉత్పత్తి తిరిగి పుంజుకుంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు ఉల్లి ధరల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Show comments