T20 World Cup 2024 Tim Southee Reprimanded: గ్రూప్ స్టేజ్​లోనే ఇంటిదారి పట్టిన కివీస్​కు మరో ఎదురుదెబ్బ.. ఈ కష్టం పగోడికీ రాకూడదు!

గ్రూప్ స్టేజ్​లోనే ఇంటిదారి పట్టిన కివీస్​కు మరో ఎదురుదెబ్బ.. ఈ కష్టం పగోడికీ రాకూడదు!

టీ20 వరల్డ్ కప్​లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్​ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.

టీ20 వరల్డ్ కప్​లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్​ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.

టీ20 వరల్డ్ కప్-2024 ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్​ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్స్​లో కివీస్ నెక్స్ట్ లెవల్ గేమ్​తో అలరిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు అండర్​డాగ్స్​గా బరిలోకి దిగి టాప్ టీమ్స్​ తాట తీసింది. వరల్డ్ కప్ నెగ్గలేదు గానీ చాలామార్లు సెమీస్, ఫైనల్స్​కు చేరుకున్న ఘనత ఆ జట్టుకు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్​తో చివరి బాల్ వరకు పోరాడటం న్యూజిలాండ్​కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆ టీమ్ అంటే చాలు.. అందరూ వణుకుతారు. కానీ పొట్టి కప్పులో ఆ మ్యాజిక్​ను రిపీట్ చేయలేక తుస్సుమంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి గ్రూప్ దశ ముగియక ముందే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మెగా టోర్నీలో ఫస్ట్ మ్యాచ్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో 84 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది న్యూజిలాండ్. ఆ మ్యాచ్​లో 75 పరుగులకే ఆలౌట్ అవడం అవమానకరమనే చెప్పాలి. ఆ తర్వాతి మ్యాచ్​లోనైనా కోలుకుంటుందని భావిస్తే అది జరగలేదు. ఆతిథ్య వెస్టిండీస్​తో కీలక మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో ఓడింది కివీస్. దీంతో ఆ టీమ్ సూపర్-8 అవకాశాలు క్లోజ్ అయ్యాయి. ఉగాండా, పపువా న్యూ గినియాతో నెక్స్ట్ రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. కానీ వాటిల్లో నెగ్గినా తదుపరి దశకు చేరుకునే ఛాన్సులు లేకపోవడంతో ఆ రెండు మ్యాచులు నామమాత్రంగా మారాయి. కివీస్ వరుస ఓటములు, గ్రూప్ దశతోనే స్టోరీ ఎండ్ అవడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

కివీస్ సీనియర్ పేసర్ టిమ్ సౌతీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మందలించింది. వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్​కు గురైన సౌతీ.. డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్​ను తన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ మూన్ జరిపిన విచారణలో తన తప్పును ఒప్పుకున్నాడు సౌతీ. అయితే ఐసీసీ 2.2 కోడ్ ఆఫ్ కండక్ట్​ను ఉల్లంఘించినందుకు, లెవల్ 1 నేరం కింద అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. క్రమశిక్షణా చర్యల కింద డీమెరిట్ పాయింట్​లో కోత్ వేయడమే గాక అతడ్ని మందలించింది కూడా. ఇలాంటిది మళ్లీ రిపీట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అసలే సూపర్-8 ద్వారాలు మూసుకుపోవడంతో బాధలో ఉన్న కివీస్​కు.. సీనియర్ పేసర్​ను ఐసీసీ హెచ్చరించడం, పాయింట్లలో కోత విధించడం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. దీని గురించి తెలిసిన నెటిజన్స్.. న్యూజిలాండ్ కష్టం పగోడికి కూడా రావొద్దని అంటున్నారు. మరి.. సౌతీ విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments