TTD కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు… ఇక నుంచి ఈ రూల్ పాటించాల్సిందే!

TTD కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు… ఇక నుంచి ఈ రూల్ పాటించాల్సిందే!

దేశ వ్యాప్తంగా అనేక చోట్ల టీటీడీ కల్యాణ మండపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కల్యాణ మండపాలు ఉన్నాయి.  తక్కువ రుసుముతో ఈ మండపాల్లో ఎన్నో జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యాయి. తాజాగా టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంది. సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ మండపాల్లో జరిగే వివాహల విషయంలో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలలో జరిగే వివాహాల సందర్భంగా సినిమా పాటలు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సినిమా, డీజేపీ పాటలకు బదులుగా భక్తి గీతాలు, లలిత గీతాలను పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని భూమన తెలిపారు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఛైర్మన్ స్పష్టం చేశారు. టీటీడీ కళ్యాణ మండపాల్లో జరిగే వివాహాలు జరిపించేవారు డీజేలు, సినిమా పాటలను పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇక, టీటీడీకి తెలుగు రాష్ట్రాల్లో 250కిపైగా కళ్యాణ మండపాలు ఉన్నాయి. వీటిని సామాన్యులకు అనుకూలంగా ఉండే ధరలతో వివాహాలు, వేడుకలకు అద్దెకు ఇస్తుంటారు.  గ్రేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటే రూ.5,000, జిల్లా కేంద్రంలో ఉంటే రూ.4,000, మండల కేంద్రాల్లో రూ.1000 నుంచి 1,500, మున్సిపాల్టీల్లోని రూ.2,000 మాత్రమే వసూలు చేస్తారు. ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్‌ ధరలతో పోల్చితే టీటీడీ కళ్యాణ మండపాలు చాలా తక్కువలోనే అద్దెకు తీసుకోవచ్చు. అందుకే టీటీడీ కల్యాణ మండపాలకు మంచి డిమాండ్ ఉంది. మరి.. టీటీడీ కల్యాణ మండపాల విషయంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments