అంత తమకే తెలుసు అనుకొనే రాజకీయ నేతలు కొంతమంది ఉంటారు. అలా అనుకొనే అబాసుపాలవుతారు. అలాంటి నేతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష ఉపనేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కాస్తా చర్చకు దారి తీశాయి. రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్ర మంత్రుల సైతం పేర్కొన్నారు. బిజెపి సీనియర్ నేతలు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారు.
కాని టిడిపి స్వయం ప్రకటిత మేథావి యనమల రామకృష్ణుడు మాత్రం రాజధాని కేంద్ర పరిధిలో ఉన్న అంశమని కొత్త పల్లవి అందుకుంటున్నారు. దీంతో ఆయన అబాసుపాలైయ్యారు. గత టిడిపి హయంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు జరిగే సమయంలో ఇదే యనమల, ఇతర టిడిపి నేతలు రాష్ట్ర రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని అన్నారు. అది కరెక్టే. రాష్ట్ర రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే. అయితే ఇప్పుడు అదే యనమల, టిడిపి నేతలు రాష్ట్ర రాజధాని కేంద్రం పరిధిలో అంశమని అంటున్నారు.
ఇదే టిడిపి రెండు నాల్కుల ధోరణి. ఏప్పుడూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా…అధికారం పోయిన తరువాత ఒకలా వ్యవహరిస్తుంది. అందుకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నుంచి ఆ పార్టీ నేతలంతా ద్వంద్వ వైఖరులు అవలంబిస్తోన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది.
ఇటివలి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి…! “రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. ఈ అంశాలన్నీ గవర్నర్ పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలి. వివాదాస్పద బిల్లులపై భిన్నాభిప్రాయాలు ఉన్నందుకే కేంద్రం సలహా తీసుకోవాలని కోరాం. ప్రభుత్వం ఓసారి చట్టం అయిందని భావించాక ఇక అది రాష్ట్రపతికి పంపాలా లేక న్యాయ సలహా కోరాలా అనేది గవర్నర్ ఇష్టం” అని అన్నారు.
ఇందులో యనమల చేసిన వ్యాఖ్యలకు..రాజధాని ఏర్పాటుకు సంబంధం లేదు. రాష్ట్ర రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని రాష్ట్ర విభజనకునోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. కాని యనమల మళ్లీ కొత్త వాదన తీసుకొస్తోన్నారు. ఆయన చేసిన ప్రతిపాదనలు చూసి న్యాయ కోవిధులకే అంతుపట్టడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.