మరో రెండు సంవత్సరాల్లో జరిగే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఏన్నికల్లో కాషాయ జెండా రెపరేపలాడించాలని తహతహలాడుతున్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవలే జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడుచోట్ల ఘన విజయం సాధించి, క్లీన్ స్వీప్ చేసింది.
వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కలియాగంజ్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఎంసీ అభ్యర్థి తపన్ దేబ్ సింఘా తన సమీప బీజేపీ ప్రత్యర్థి కమల్ చంద్ర సర్కార్‌పై 2,304 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఖరగ్‌పూర్ సదర్ నియోజవర్గంలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ 20,811 ఓట్ల భారీ ఆధిక్యంతో భాజపా అభ్యర్థి ప్రేమ చంద్రపై గెలుపొందారు,మరొక శాసనసభ స్థానం కరింపుర్ లో 24000 భారీ ఆధిక్యంతో టీఎంసీ అభ్యర్థి బిమలేందు సిన్హా రాయ్ భాజపా అభ్యర్థి జయ ప్రకాష్ మజుందార్ మీద భారీ విజయం సాధించడంతో,పోటీ చేసిన మూడు స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసినట్లయింది.
మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ ఘన విజయాలతో, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఖరగ్‌పూర్‌కు అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర శాఖా అధ్యక్షుడు సదర్ దిలీప్ ఘోష్, కరీంపూర్కు చెందిన టిఎంసి ఎమ్మెల్యే మహువా మొయిత్రా 2019 లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. మరొక స్థానం కలిగంజ్ సీటును అక్కడ వరుసగా పది సార్లు వరుసగా నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమీథనాథ్ రాయ్ మరణంతో ఖాళీ అవ్వడంతో ఈ మూడు స్థానాల్లో నవంబర్ 25 న సోమవారంనాడు ఉపఎన్నిక నిర్వహించారు.
గత ముప్పై సంవత్సరాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న కరింపుర్,ఖరగపూర్ సదన్ స్థానాలను గత 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరలా తన పట్టు నిలుపుకుంది.. గత పది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కలిగంజ్ స్థానాన్ని 2016 ఎన్నికల్లో భాజపా గెలుచుకుంది..తాజాగా వెలువడ్డ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.. ఈ విధంగా మూడు జాతీయ పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ గట్టి దెబ్బ కొట్టింది.
ఫలితాల ప్రకటన తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని బెంగాల్ ప్రజలకు అంకితం చేస్తున్నామని. బిజెపి తన అధికారం తో అహంకారంతో బెంగాల్ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తగిన మూల్యం చెల్లించారని అన్నారు..ప్రతిపక్ష పార్టీ సిపిఐ (ఎం) మరియు కాంగ్రెస్ తమను బలోపేతం చేయడానికి ప్రయత్నించకుండా, పశ్చిమ బెంగాల్ లో బిజెపికి సహాయం చేస్తున్నాయి అని అందుకే వారు తృతీయ స్థానాలకు పరిమితమయ్యారని మమతా బెనర్జీ విమర్శించారు.
Written By -Kamal Saida