కరోనా పేరెత్తితేనే సామాన్యుడి నుంచి దేశ అధ్యక్షుల వరకు చిగురుటాకుల వణికిపోతున్నారు.ఒకప్పుడు గ్రామాలలో దెయ్యం భయంతో “ఓ స్త్రీ రేపు రా” అంటూ గోడలపై రాసేవారు ప్రజలు.కానీ ఇప్పుడు అంతకు మించిన కరోనా రాక్షసి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని కొన్ని గ్రామాల సరిహద్దుల్లో “బంధువులారా!దయచేసి మా ఊర్లోకి రాకండి” అన్న బోర్డు దర్శనమిస్తున్నాయి.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ బయటినుండి ఎవరు తమ గ్రామాలలోకి రాకుండా,తమ గ్రామంలోని వాళ్లను బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు పల్లెప్రజలు.విశాఖ జిల్లాలోని ఎస్.రాయవరం,ఉప్పరపల్లితో పాటు పలు గ్రామాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ తమ గ్రామ సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసుకున్నాయి.బయటకు వెళ్ళిన గ్రామస్తులే కాక అత్యవసరమై తమ గ్రామాలలో రావాలనుకునే వారి కోసం గ్రామ శివార్లలో శానిటేషన్ కోసం ఫినాయిల్ నీళ్లు కూడా ఏర్పాటు చేశారు.ఏలూరు పరిసర ప్రాంతాల్లోని లంక గ్రామాలు పూర్తి అప్రమత్తతో తమ గ్రామాల్లోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్.వ్యాప్తి దృష్ట్యా పల్లె ప్రజలు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ పరిసర గ్రామాలలోని ప్రజలు ఎక్కడికక్కడ ముళ్లకంచెలతో గ్రామ సరిహద్దులు మూసేస్తున్నారు.అత్యవసరమైతే తప్ప ఎవరు పది రోజుల పాటు తమ గ్రామాలకు రావొద్దని చూస్తున్నారు కొమురం భీం జిల్లాలోని ఆదివాసులు కూడా తమ గ్రామాలను కరోనా బారినుండి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 31 వరకు తమ గ్రామంలో ఎవరు రావద్దని అలాగే తమ వారు ఎక్కడికి వెళ్లకూడదని తీర్మానించారు.పెళ్లిళ్లు,పండగలు, పూజలు కూడా వాయిదా వేశారు.చాలా గిరిజన గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
6132