ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలి హీరోలతో సమానంగా మార్కెట్ ని సంపాదించుకుని కేవలం తన యాక్టింగ్ ప్లస్ ఇమేజ్ తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ళ క్రితం సినిమాలు మానేసిన సంగతి తెలిసిందే. మధ్యలో రాజకీయాల్లో ప్రవేశించినా చిరంజీవి తరహాలో చెప్పుకోదగ్గ ముద్ర వేయలేక సైలెంట్ అయ్యారు. గత ఏడాది మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చాక ఇకపై కంటిన్యూ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టే పలువురు దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇచ్చారు కానీ ఆవిడ మాత్రం ఇకపై కొనసాగే ఉద్దేశం లేదని చెప్పి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారినట్టు ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో విజయశాంతికి మాత్రమే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ఒకటుందట. ఆవిడకు అది చెప్పే ప్రయత్నంలో శివ ఉన్నట్టుగా తెలిసింది. గతంలో తారక్ బాబాయ్ బాలకృష్ణతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో విజయశాంతి పాలు పంచుకోవడం అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, లారీ డ్రైవర్, అపూర్వ సహోదరులు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు ఇక్కడితో ఆగదు. ఇప్పుడు యంగ్ టైగర్ మూవీలో పాత్రంటే ఖచ్చితంగా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే అఫీషియల్ అయ్యేదాకా ఏదీ చెప్పలేం.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలై వీలైనంత వేగంగా పూర్తవుతుందాని జూనియర్ ఎన్టీఆర్ ఎదురు చూస్తున్నాడు. కొరటాల శివ ప్రాజెక్ట్ ని ఈ వేసవిలోనే మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ రావడంతో అభిమానులను సంతృప్తి పరిచేందుకు సినిమాల వేగం పెంచాలని తారక్ డిసైడ్ అయ్యాడు. తర్వాత లైన్ లో కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ ఉన్నాడు. పక్కా ప్లానింగ్ తో క్రేజీ డైరెక్టర్లతో జట్టు కడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇవయ్యాక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేసే అవకాశం ఉంది. ఆలోగా అతను మరో బ్లాక్ బస్టర్ అందుకుంటే ఛాన్స్ శాతం పెరుగుతుంది.