ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై పదే పదే విమర్శలు చేస్తే ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇసుక రవాణాకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను వెల్లంపల్లి తిప్పికొట్టారు. గత కొన్ని రోజులుగా భారీ వరద పోటెత్తడంతో 50 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచే ఉన్నాయి. బ్యారేజ్‌లోకి వరద పోటెత్తుతుండడంతో ఇసుక ఎక్కడి నుంచి తీయాలో చెప్పాలని పవన్‌ను ప్రశ్నించారు. చంద్రబాడునాయుడుకు పవన్ కల్యాణ్ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ విమర్చించారు.