ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కానుక వచ్చేసింది. గతంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటికీ అది జరిగి ఏడు నెలలు దాటడంతో ఏదైనా కొత్తది కావాలని కోరుకున్నారు ఫ్యాన్స్. వాళ్ళ నిరీక్షణకు తెరదించుతూ దిల్ రాజు టీమ్ మోషన్ పోస్టర్ ని వీడియో రూపంలో రిలీజ్ చేసింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ ఆధారంగా రూపొందుతున్న వకీల్ సాబ్ లో అజిత్ తమిళ్ వెర్షన్ కు చేసిన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే నిముషం కూడా లేని చిన్నపాటి వీడియోలో పవన్ లాయర్ లుక్ ని రివీల్ చేశారు. సత్యమేవ జయతే అంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుండగా ఒక చేతిలో కర్ర, మరోచేతిలో లా పుస్తకాన్ని పట్టుకున్న పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ నిజంగానే పవర్ ఫుల్ గా ఉంది. మొదటిసారి న్యాయవాదిగా నటిస్తున్న పవన్ దానికి తగ్గట్టే అందులో ఒదిగిపోయాడు. డిగ్నిఫైడ్ గా ఉంటూనే మాస్ లుక్ ఇవ్వడం ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఉంది. తమన్ బిజిఎం కూడా ఎలివేట్ అయ్యింది. వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా కొద్దిపార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల నిరవధికంగా బ్రేక్ పడింది. వచ్చే నెల నుంచి కొనసాగిస్తారా లేక ఇంకా ఆలస్యమవుతుందా ఇంకా తెలియాల్సి ఉంది.
ఒకవేళ సంక్రాంతి 2021కి టార్గెట్ చేసుకుంటే మాత్రం కనీసం అక్టోబర్ నుంచి పనులు మొదలుపెట్టాలి. అంతకన్నా లేట్ అయితే మాత్రం డెడ్ లైన్ మీద కావడం కష్టమే. బడ్జెట్ పరంగా హెవీ కాన్వాస్ డిమాండ్ చేసేది కాదు కాబట్టి త్వరగానే పూర్తి చేసుకోవచ్చు. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో ఇంకా శృతి హాసన్ జాయినవ్వాల్సి ఉంది. ఇదీ అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించలేదు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న వకీల్ సాబ్ కు ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అందరి చూపు థమన్ సంగీతం మీదే ఉంది. ఇప్పటికే వచ్చిన ఆడియో సింగల్ మగువా మగువా చార్ట్ బస్టర్ గా నిలిచింది. మిగిలిన పాటల మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి వకీల్ గా పవన్ కళ్యాణ్ అంచనాలకు తగ్గట్టే వచ్చేశాడు
Motion Poster Link @ https://bit.ly/3hR6WMG