తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టిటిడి లో భర్తీ చేసే జూనియర్ అసిస్టెంట్ స్థాయి లోపు ఉద్యోగాలలో చిత్తూరు జిల్లా కు పెద్ద పీట వేసింది. 75 శాతం ఉద్యోగాలను చిత్తూరు జిల్లా అభ్యర్థులకు రిజర్వ్ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తీర్మానాని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపాదించారు. టిటిడి తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే.. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉన్న అన్ని ఉద్యోగాల్లో 75 శాతం చిత్తూరు జిల్లా అభ్యర్థులకు దక్కుతాయి.