టాలీవుడ్ హీరోల కుడి చేతులకు వరుసగా సర్జరీలు జరుగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా మెగాస్టార్ చేతికి సర్జరీ జరిగింది. కుడి చేత్తో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రావడంతో సర్జరీ చేశారు. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారరు. దీంతో 15 రోజులు గ్యాప్ తీసుకున్న ఆయన నవంబర్ ఒకటో తారీకు నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది జరిగి 15 రోజులకు పైగా కాగా సరిగ్గా నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ కూడా హాస్పిటల్ పాలయ్యారు.
కొన్ని రోజులుగా ఆయన భుజం నొప్పి కారణంగా బాధపడుతున్న క్రమంలో అక్టోబర్ 31న హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. షోల్డర్ పెయిన్ తో ఉండడంతో 4 గంటల పాటు సర్జరీ జరిగింది. ఇవి మరువక ముందే దీపావళి పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకులతో కలిసి దిగిన ఫోటో కారణంగా ఆయన అభిమానాలను టెన్షన్ పెడుతోంది. నిజానికి ఎన్టీఆర్ స్వయంగా షేర్ చేసుకున్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ సాంప్రదాయ దుస్తులతో కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అదే సమయాన ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజి ఉన్నట్లు కనిపించడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. దీంతో ఎన్టీఆర్ చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని ఫాన్స్ కంగారు పడుతున్నారు.
అయితే ఈ విషయం మీద ఆరా తీస్తే వ్యాయామం చేస్తున్న సమయంలో నటుడి వేలికి గాయం అయిందని, దీంతో ఎన్టీఆర్ సర్జరీ కూడా చేయించుకన్నట్లు తెలుస్తోంది. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్ చేతి వేలు విరిగిందని తేలడంతో ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. ఇక ఈ సర్జరీ గురించి అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఠీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ సహా, ఎవరు మీలో కోటిశ్వరులు మొదటి సీజన్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు. అయితే కొరటాల సినిమాకు బాడీ బిల్డ్ చేసే పనిలోనే వ్యాయామం చేస్తున్నాడని ఆ సమయంలోనే ఇలా జరిగిందని తెలుస్తోంది.
Also Read : Enemy Movie Report : ఎనిమి సినిమా రిపోర్ట్