DONT MISS “PLAY BACK”
తెలుగు సినిమాకి,అలా మాట్లాడితే ఇండియన్ సినిమాకే పరిచయం లేని ఒక కొత్త కథ ఈ “PLAY BACK”
కొత్త స్క్రీన్ ప్లే…
అందరు రెగ్యులర్ గా ఉపయోగించే “డిఫరెంట్ సినిమా” కాదండి ఇది….
నిజంగానే డిఫరెంట్ సినిమా …
మామూలుగా ప్రతీ సినిమా ప్రేక్షకుల కోసమే తీయబడతాయ్..
ప్రేక్షకుల ఆనందం కోసమే తీయబడతాయ్..
కానీ కొన్ని సినిమాలు మాత్రమే కేవలం ప్రేక్షకుల కోసమే కాకుండా మేకర్స్ కి కూడా చాలా ఉపయోగపడేలా తీయబడతాయ్….
మేకర్స్ చాలా విషయాల్ని కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా తీయబడతాయ్..
వాళ్ళకి ఒక గైడ్ లా ఉపయోగపడతాయ్.
అలా ప్రేక్షకుల కోసం మరియు మేకర్స్ కి కూడా చాలా ఉపయోగపడేలా తీయబడ్డ సినిమా ఈ “PLAY BACK”..
కొత్త కథ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, కొత్తరకం స్క్రీన్ ప్లే ప్రయత్నం చెయ్యాలనుకునే వాళ్ళకి ఇదొక పుస్తకం..
ఈ మాట అతిశయోక్తి కాదు.
ఇంత కొత్త కథ,ఇంత గొప్ప స్క్రీన్ ప్లే ఈ మధ్యకాలంలో అయితే ఇండియన్ సినిమాలో రాలేదు.
అసలు ఇలాంటి కథని టచ్ చెయ్యడానికి ఎవరూ సాహసించరు..
చాలా కష్టమైన కథని ,అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్ లో ఉండే విధంగా చాలా క్రిస్టల్ క్లియర్ గా చూపించబడ్డ సినిమా “PLAY BACK”
ఇలాంటి స్క్రీన్ ప్లే చెయ్యడం మామూలు విషయం కానే కాదు.
అందుకే దీన్నొక పుస్తకం అని అంటున్నాను…
కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఈ సినిమాలో ..
మిస్ అవకుండా చూడండి..
మామూలుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఇది ఫలానా కొరియన్ సినిమా కి కాపీ అనే వార్తలు మనకి కనపడ్డాయ్..
అలాంటి కథలతో ఆ ఒక్క సినిమానే కాదు చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయ్…
ఆ ఒక్క క్రాస్ కనెక్షన్ అనే పాయింట్ తప్ప మిగతా కథగానీ,స్క్రీన్ ప్లే గానీ చాలా కొత్తగా చేసుకున్నాడు డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా..
కొన్ని సినిమాలుంటాయ్..
సినిమా అద్భుతంగా ఉండి కూడా థియేటర్ లో ప్రేక్షకాదరణకి నోచుకోక ఎప్పుడో TV లోనో,OTT లోనో వచ్చినప్పుడు “అరే ఇంత గొప్ప సినిమాని ఎలా మిస్ అయ్యాం” అని ఆడియన్స్ రిగ్రెట్ ఫీల్ అయ్యే సినిమాలు.
ఈ సినిమా ఆ లిస్ట్ లోకి చేరిపోకుండా,మీరు భవిష్యత్తులో రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం రాకుండా ఇంత అద్భుతమైన సినిమాని థియేటర్ లో చూడమని చెప్పడానికే ఈ నా కామెంట్.
Dont miss “PLAY BACK”😍