రాష్ట్రంలో ప్రజలను మహమ్మరిలా పట్టి పీడిస్తున్న కరోనాని కట్టడి చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగానే కాకుండా, కరోనా ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని వచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అలాగే ఆర్టీసి బస్సులని సంజీవిని పేరుతో జిల్లాలో కరోనా టెస్టులు చేసి వ్యాధికి గురైన వారిని కనుగొనే విధంగా వాటిని తయారు చేసి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్నీ జిల్లాలకు పంపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇటీవిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలయిన తెలంగాణ , తమిళనాడు , కర్నాటకా లోని వాటి రాజధానులలో కరోనా విలయతాండవం చేయాడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి స్వస్థలానికి అధికసంఖ్యలో చేరుకోవడంతో ఏపీలో కూడా గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులను రోజు రోజుకి పెరుగుతు ఉన్నాయి. దీనితో అప్రమత్తం అయిన ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రుల్లో మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికలు సిద్దం చేశారు.
కోవిడ్ సమాచారానికి సంబంధించి 24 గంటలు నిరంతరాయం పనిచేసే విధంగా ఇప్పటికే 1902 నెంబర్ తో కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే తాజాగ పెరుగుతున్న పాజిటివ్ కేసులని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 46,198 బెడ్లు సిద్దం చేసినట్టు, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కనీసం 5వేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే చిత్తూరు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ మేరకు బెడ్లను ప్రభుత్వం సిద్దం చేసింది.
అలాగే మొదట నుండి రాష్ట్రంలో క్వారైంటైన్ లో ఉన్న కోవిడ్ పేషంట్లకు నాణ్యమైన ఆహారం అందించడం, శానిటేషన్ , మందులు , పరిశుభ్రతపై సీయం జగన్ ఆదేశాలమేరకు అధికారులు ఎప్పటికపుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతి రోజు కోవిడ్ సెంటర్ నుంచి అరడజన్ మంది దగ్గర క్వారంటైన లో వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయో లేదా అనే ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మెరుగైన సేవలు అందిస్తోంది ప్రభుత్వం.
వీటితో పాటు రానున్న రోజుల్లో మరింత మేరుగైన సేవలు అందించే విధంగా 17వేల మంది వైద్య సిబ్బందిని అదనంగా సిద్దం చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కరోనాపై పోరులో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తు ప్రజల సంరక్షణే ప్రథమ ధ్యేయంగా ఆయన పాలన సాగిస్తునట్టు కోవిడ్19 టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. ఏది ఏమైనా కరోనా కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకున్న దారి వారికి సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి.