మార్కెట్ మాయాజాలం టమోటా రైతులను ఠారెత్తిస్తోంది. ఉదయం ఉన్న ధర, మధ్యాహాన్నం ఉండటం లేదు. సాయంత్రం ధర ఇంకా పతనమువుతోంది. అప్పులు చేసి పండించిన పంటను మార్కెట్ కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రాని దారుణ పరిస్థితి కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్ లో నెలకొంది. 20 కేజీలుఉన్న జత బుట్టల టమోటాలు ధర రూ. 30 రూపాయలకు దళారులు కొనుగోలు చేస్తుంటే రైతు కడుపు మండింది. కేజీ ధర 75 పైసలు పలుకుతుండగా.. సరుకు మార్కట్ కు తరలించేందుకు ఐన రవాణా ఖర్చులు కూడా రావడం లేదన్నఆవేదనతో న్యాయం కోసం రైతన్నశనివారం రోడ్డు ఎక్కారు. వ్యాపారుల, దళారుల మోసాన్ని ఎండగట్టారు.
మార్కెట్ లో క్రయ విక్రయాలపై కమిషను ప్రభుత్వం రద్దు చేయగా.. వ్యాపారులు తమకు నష్టమంటూ కొనుగోళ్లు చేయకుండా మిన్నుకుండిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ బయట కొనుగోళ్లు జరుపుతూ కమిషన్లు వాసులు చేస్తున్నాచర్యలు తీసుకోవడం లో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రైతన్నలు రోడ్డు ఎక్కి నిరసనలు చేపట్టిన నేపధ్యం లో వారికి తక్షణం న్యాయం చేసేలా సర్కారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.