పలువురు ప్రముఖులు రాజకీయనాయకులు కరోన కాటుకు బలవుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు..
వివరాల్లోకి వెళితే తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను(72) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో శనివారం రాత్రి 11.15 నిమిషాలకు మరణించారు.
అక్టోబర్13 న ప్రయాణంలో ఉన్న ఆయనకు శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో విల్లుపురంలో ప్రథమచికిత్స తీసుకున్నారు. అనంతరం దురైకన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోన ఉన్నట్లు నిర్దారణ అయింది. కరోన వల్ల దురైకన్ను ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో శనివారం రాత్రి 11.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన దురైకన్ను 2006 , 2011, 2016లలో తిరునల్వేలీ జిల్లాలోని పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయన మరణంతో తమిళనాట అధికార పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కాగాకరోనా కారణంగా తమిళనాడులో మరణించిన రాజకీయ నాయకుల్లో దురైకన్ను మూడవవారు. గతంలో ఎమ్మెల్యే అన్బలగన్ మరియు కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్లను కూడా కరోనా మహమ్మారి బలి తీసుకుంది.