ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న లహరి అనే విద్యార్థిని బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది పక్కనే ఉన్న సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో ఒత్తిడికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని కోలుకుంటుందని కళాశాల ప్రిన్సిపాల్ కేసీ రెడ్డి తెలిపారు.