స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం వైఎస్సార్ సీపీ ప్రకటించిన అనంత ఉదయభాస్కర్, (అనంతబాబు) తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కీలకమైన నాయకుడు. పార్టీకి తొలినుంచి చుక్కానిలా వ్యవహరిస్తూ అక్కడ అనేక విజయాలను అందించారు. టీడీపీ కంచుకోట అయిన రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడంలో గట్టి కృషి చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన మాజీ మంత్రి, దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అనుచరుడు. అనంతబాబు తొలి నుంచీ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉన్నారు.
అప్పట్లో అధికార టీడీపీ అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా, విశాఖ జైలులో ఉంచినా బెదరలేదు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రావాలని అనేక ఒత్తిళ్లు చేసినా లొంగలేదు.రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ పర్యటనను విజయవంతం చేశారు. ఓదార్పు యాత్ర సమయం నుంచి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తూ, రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠ పరిచారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న రంపచోడవరం ఏజెన్సీని తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్సీపీకి కంచుకోటగా చేశారు.
Also Read : MLC, YCP -వరుదు కల్యాణికి ఎమ్మెల్సీ వరం
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. 2014 లో దాకోడు సర్పంచ్ గా ఉన్న వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యే గా నిలబెట్టి గెలిపించారు. ఎమ్మెలే వంతల రాజేశ్వరి టీడీపీలోకి ఫిరాయించినా పార్టీలోనే ఉండి 2019 లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా ఉన్న నేటి ఎమ్మెల్యే ధనలక్ష్మిని కూడా సొంత చరిష్మాతో అసెంబ్లీకి పంపించారు. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రంపచోడవరం నియోజకవర్గంలో 90 శాతం స్థానాలు గెలవడంలో అనంతబాబు కృషి చేశారు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పదవులు చేపట్టారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడు, 2006లో అడ్డతీగల ఎంపీపీ, 2019లో డీసీసీబీ చైర్మన్గా పదవులు చేపట్టారు. 2009 లో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసిన నామినేషన్ సాంకేతిక కారణాల రీత్యా తిరస్కరణకు గురయ్యింది. 2009 లో రాజశేఖర్ రెడ్డి మరణాంతర పరిణామాల తరువాత జగన్ కి దగ్గరయ్యారు.
రాజకీయ, కుటుంబ నేపథ్యం..
ఏజెన్సీ ప్రాంతంలో ఎల్లవరం గ్రామములో జన్మించిన అనంత బాబు తన ముత్తాతల దగ్గరనుంచి రాజకీయం చూసి నేర్చుకుని మంచి రాజకీయ నాయకుడు అయ్యారు. 1965 లో బాబు ముత్తాత పడాల వీర్రాజు అడ్డతీగల సమితి అధ్యక్షుడు గా పనిచేశారు.1975 లో తాత అనంత వీర్రాజు కూడా సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1982-1987 వరకు తండ్రి అనంత చక్రరావు కూడా సమితి అధ్యక్షుడుగా రాజకీయ చక్రం తిప్పారు. 1987 కి ముందు ప్రజాప్రతినిధులు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో ఓ కీలకమైన రాజకీయ మార్పు జరిగి సమితి అధ్యక్షుడు బదులు గా మండలం నుంచి ఒకరిని ఎన్నుకునే విధానం వచ్చింది. ఆ సమయం లో 1987 నుంచి 1989 వరకు చక్రరావు మండల ప్రెసిడెంట్ గా ఓ వెలుగు వెలిగారు. ఆయన వారసుడుగా వచ్చిన అనంతబాబు జెడ్పీటీసీగా మొదలై ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఎదిగారు.
Also Read : Mlc,Raghu Raju – రఘురాజు కష్టానికి దక్కిన ఫలితం