దేశంలో పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కూడా కరోనా సోకడంతో హోమ్ క్వారెంటయిన్ లోకి వెళ్లిపోయారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.
వివరాల్లోకి వెళితే బీజేపీ నేత పురందేశ్వరికి కొద్దిపాటి అనారోగ్యంగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆవిడ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పురందేశ్వరికి ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది… దాంతో ఆమెకు పలువురు నేతలు, సన్నిహితులు, ఆమెను కలిసి అభినందలు తెలియజేసారు. వారి ద్వారా ఆమెకు కరోనా సోకిందేమో అని అనుమానిస్తున్నారు.