ప్రజా సమస్యల పరిస్కారమే లక్ష్యంగా ఆంద్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన ‘స్పంధన’ కార్యక్రమం ఇక పై ప్రవాసులు అందుబాటులోకి రానుంది. రాష్ట్రం వెలుపుల ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఊర్ల లోని తమ, తమ వారి సమస్యలను నేరుగా వీడియో కాన్ఫెరెన్క్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. ఈ సరి కొత్త విధానానికి ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు వినూత్న విధానాలతో సిద్దార్థ్ వార్తల్లో నిలిచారు. జిల్లా లో స్థానిక పోలీసులతో ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఆన్ లైన్ లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రతి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లా ఎస్పీ తన వద్దకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడతారు. మ.2.30–4.00 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పోలీసుస్టేషన్లకు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఆన్లైన్ స్పందన కార్యక్రమానికి సంబంధించి టైమ్‌స్లాట్‌ను నిర్ణయించనున్నారు. విదేశాలలో ఉండేవారు ముందుగా ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ప్రకాశం జిల్లా వాట్సప్ నంబర్ 9121102266కు లేదా ‘ప్రకాశం పోలీస్’ ఫేస్బుక్ అకౌంట్‌కు ఒక రిక్వెస్ట్ పంపుకోవాలి. దీంతో తమకు ఫలానా సమయంలో కుదురుతుందని పేర్కొంటూ ఆ సమయాన్ని వాట్సప్ ద్వారా ఒక లింక్ ఇస్తారు. దాని ద్వారా నేరుగా ఎస్పీతో మాట్లాడేందుకు అవకాశం కలుగుతుంది. ఇలా మాట్లాడిన వారికి కూడా ఆన్లైన్ లేదా వారి బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్తే స్పందన రశీదును కూడా అందజేస్తారు.
సీఎం ఆదేశాలను జిల్లా ఎస్పీ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఫిర్యాది, విచారణాధికారి, తాను ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి నేటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందనను నిర్వహించాలని నిర్ణయించారు. తామూ జిల్లాకు చెందిన వారమేనని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఓ ప్లాట్‌ఫాం అవసరమంటూ తమ ఆవేదనలను ఇప్పటికే ఎస్పీకి ఫేస్బుక్ ద్వారా పలువురు తెలియజేశారు. భూ సమస్యలను సైతం రెవెన్యూ, భూసర్వే విభాగం తదితర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా పరిష్కరిస్తుండడంతో జర్మనీ, హైదరాబాదు నుంచి ఎస్పీకి వినతులు అందాయి. దీంతో స్పందనను విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించారు.