బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరసనకు కానీ, ప్రతిపక్ష నాయకులు బాధితులను కలవటానికి కానీ అనుమతి ఇచ్చిందే లేదు. పైగా శవ రాజకీయాలని,సానుభూతి రాజకీయాలని ఎదురు దాడి చేసేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాసామ్యం, ప్రజల హక్కులు భలే గుర్తొస్తాయి. గుంటూరు జిల్లాలో ఆత్మకూర్ అనే గ్రామంలో ఎన్నికల తరువాత వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలను ఊరి నుంచి తరిమేసి వారి ఆస్తులు లాక్కున్నారని ,ఆ భాదితుల కోసం టీడీపీ తరుపున గుంటూరులో ఒక శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తల మీద దాడులు ఆపటానికి,వారిని తిరిగి స్వగ్రామానికి చేర్చటం కోసం బాబుగారు రేపు ఆ ఆత్మకూరు గ్రామానికి వెళుతున్నారంట.
గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఆప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ విధించారు. రేపు ఎలాంటి సభలకు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదని ఎవరు ఆత్మకూరు వెళ్ళవొద్దని చెప్పారు. పరిస్థితి బాబుగారు ఆరోపించినంత దారుణంగా ఉందా?టీడీపీ వారి ఆస్తులను వైసీపీ వారు లాక్కుంటున్నారా?ఈ పరిస్థితి ఒక్క మాచెర్ల-గురజాల నియోజకవర్గాలలోనేనా లేక రాష్ట్రం మొత్తం ఉందా?లేక ఇది బాబుగారి రాజకీయ ప్రదర్శనా?
ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత గెలిచిన పార్టీ వాళ్ళు ప్రత్యర్థుల మీద దాడి చెయ్యటం అనేక సందర్భాలలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తరువాత కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. కానీ ప్రత్యర్థుల ఆస్తులు లాగేసుకొని ఊర్ల నుంచి వెళ్లగొట్టన సంఘటనలు 1999 ఎన్నికల తరువాత దాదాపుగా లేవు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి అంటే ఆస్తులు లాగేసుకొని ఊర్ల నుంచి వెళ్లగొట్టటం లేదు. ఇప్పుడు ఎందుకు గురజాల ప్రాంతంలోనే ఈ గొడవలు?కారణం గురజాల మాజీ MLA యరపతినేని శ్రీనివాస రావు గత 5 సంవత్సరాలలో సాగించిన సమాంతర పాలన. సత్తెనపల్లిలో K -Tax అయితే గురజాలలో మైనింగ్ మరియు ఇతర వ్యాపారుల మీద యరపతినేని కప్పం వసూలు చేశాడని ఆరోపణలు. మంత్రి పదవి రాకున్నా జిల్లాలో మంత్రుల మాట కన్నా యరపతినేని మాటే ఎక్కువ చెల్లేది.
బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరసనకు కానీ ప్రతిపక్ష నాయకులు బాధితులను కలవటానికి కానీ అనుమతి ఇచ్చిందే లేదు పైగా శవ రాజకీయాలని,సానుభూతి రాజకీయాలని ఎదురు దాడి చేసేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాసామ్యం,ప్రజల హక్కులు భలే గుర్తొస్తాయి.
వెళ్లి రండి బాబు ,ఆత్మకూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడండి. రెండు రోజులో అదే గ్రామంలో ఉండండి. పోలీస్ వారు గతంలో బాబుగారి చేపట్టిన నిరసనలతో జరిగిన సంఘటనలను గమనించి బందోబస్తు ఏర్పాటు చెయ్యండి. ఊరికి నాలుగు వైపులా రెండంచెల చెక్ పోస్ట్ పెట్టి స్థానికులను, పరిమితంగా టీడీపీ నాయకులను మాత్రమే గ్రామంలోకి అనుమతించండి.బయటి వీడియోలను అనుమతించకుండ పోలీస్ వారే మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీయంచండి.బాబుగారు ఫ్లాష్ ధర్నా చెయ్యటంలో సిద్దహస్తులు,అటు మాచెర్ల – గుంటూరు రోడ్ లేకుంటే ఇటు మాచెర్ల – దుర్గి రోడ్ ను సడన్ గా దిగ్భందనం చెయ్యగలరు.ఎదో ఒకరకంగా రాజకీయ వేడిని పుట్టించటానికి ప్రయత్నం చేస్తారు.
బాబుగారి పర్యటనకు పోటీగా వైసీపీ వాళ్ళ పోటీ కార్యక్రమం అనవసరం. బాబుగారు పనిలో పనిగా ఆత్మకూర్ గ్రామానికి కూత వేటు దూరంలో (సుమారు 8 కి.మీ) ఉన్న మాచెర్ల కూడా వెళ్ళండి. మీ పార్టీకి చెందిన ,మీ పార్టీ నాయకుల రాజీనామా చెయ్యమని చేసిన వొత్తిడి లకు తట్టుకోలేక 2016 అక్టోబర్ లో ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీదేవిగారి 13 ఏళ్ళ కొడుకును కూడా ఓదార్చండి, మున్సిపల్ ఎన్నికల కోసం వారు చేసిన అప్పుల నుంచి ఆపిల్లోడిని ఆదుకోండి.
2014 మున్సిపల్ ఎన్నికల్లో మాచెర్ల నుంచి అమెరికాలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న “గోపవరపు” మల్లికార్జున్ కుటుంబాన్ని చైర్మన్ అభ్యర్ధిగా టీడీపీ తరుపున ఎంపికచేసి మొత్తం భారం వారిమీద పెట్టారు.గోపవరపు మల్లికార్జున్ తండ్రి బ్రహ్మయ్యగారికి మాచెర్లలో వున్న గుర్తింపు & మరియు వారి వైశ్యసామాజిక వర్గానికున్న ఓటింగ్ బలాన్ని గుర్తించి chairperson అభ్యర్ధిగా ఎంపికచేశారు. TDP అనుకున్నట్టే మాచెర్ల మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది కాని MLA ఎన్నికాలో హోరా హోరి పోరాడి కేవలం 3,535 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ముందు వాగ్దానం చేసినట్లు గోపవరపు శ్రీదేవిగారిని చైర్మన్ గా ఎంపికచేశారు కాని 2.5 సంవత్సరాల తరువాత పదవి నుంచి తప్పుకోవాలని నిబంధన పెట్టారు.ఎన్నికల ముందు ఇలా 2.5 సంవత్సరాల ఒప్పందం లేకపోవటం, పైగా మొత్తం ఖర్చు శ్రీదేవి కుటుంబమే భరించటంతో వారు మొదట ఒప్పుకోలేదు కాని పార్టి పెద్దలు ఒప్పించారు. పేరుకు శ్రీదేవిగారు మున్సిపాలిటి పీఠం ఎక్కారు కాని మొదటిరోజు నుంచే సొంతపార్టి నుంచి అసమ్మతి ఎదుర్కున్నారు.పనులు జరగనివ్వలేదు,బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. వీటికి పరాకాష్టగా తెలుగుదేశం కౌన్సిలర్లు శ్రీదేవిగారికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు… క్రమశిక్షణకు మారుపేరు అనిచెప్పుకునే TDP నాయకత్వం సొంత పార్టి చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ధర్నాచేసిన కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోలేదు.
ఆస్తులు అమ్ముకోని ఎన్నికలలొ ఖర్చుపెట్టటం,తెచ్చిన అప్పుల మీద “రాజకీయ ధర్మవడ్డి” పెరగటం,పనులు జరగకపోవటం, నిత్య అసమ్మతి అన్ని కలిసి శ్రీదేవిగారి భర్త మల్లికార్జున్ గారు 38 సంవత్సరాల వయస్సులోనే “గుండెపోటు”తో చనిపోయారు. మల్లికార్జున్ గారి మరణాన్ని అదిష్టానం పట్టించుకోలేదు,జిల్లా & స్థానిక నాయకులు కూడ మనసు మార్చుకొని కనీసం మరి కొంతకాలం అవకాశం ఇవ్వకుండ శ్రీదేవిగారితో రాజినామ చేపించారు. భర్త మరణం,ఒంటరితనం,అప్పులు,మోసపొయ్యామనే భావన, అగమ్యగోచరమైన భవిషత్తు అన్ని కలిపి 35 సంవత్సరాల శ్రీదేవి గారు 21-Oct-2016న ఆత్మహత్య చేసుకున్నారు. తల్లితండ్రులను పొట్టనపెట్టుకున్న రాజకీయం తెలియని శ్రీదేవి దంపతుల 10 సంవత్సరాల కొడుకు చూస్తే భాదకలుగుతుంది. ఆరోజు బాబుగారికి కానీ,మంత్రులకు కానీ శ్రీదేవి కుటుంబాన్ని ఓదార్చటానికి సమాయం దొరకలేదు లేక మనసు రాలేదో?
ప్రతిపక్షంలో వున్నప్పుడు గ్రామస్థాయి కార్యకర్త మరణానికి కూడ స్పందించే తెలుగుదేశంపార్టి శ్రీదేవిగారి విషయంలో స్పందించిన తీరు దురదృష్టకరం.
బాబుగారు ఇప్పుడన్నా శ్రీదేవి గారి కుటుంబాన్ని ఓదార్చండి.