సినిమాలో హీరో ఎంత బలంగా ఉన్న వాడైనా విలన్ ఉంటేనే మజా. ఇద్దరూ సమానంగా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పోటీ పడితేనే పసందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ సినిమాతో పోల్చలేం కానీ… రాష్ట్రంలో అధికార పక్షానికి ధీటుగా ప్రతినాయక పాత్రలో ఎవరిని ఉంచుకోవాలో కూడా అంతుపట్టకుండా ఉంది. పార్టీల నాయకులంతా హైదరాబాద్ లో ఉండి అప్పుడప్పుడూ ఆన్లైన్లో కనిపిస్తూ వారికి తోచిందే ఏదో చెబుతుంటే ప్రజలకే నవ్వొస్తోంది. మీరు చేసేది ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాదా హైదరాబాదులో ఎందుకు అంటే… ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు మరొక అవకాశం ఉందని ఎదురు వాదిస్తారు తప్ప ప్రజల మనోభావాలను గుర్తు ఉ ఎరగరు.
రోజుకో జూమ్ పాట
ఎన్నికలు పూర్తయి 15 నెలలు కావస్తున్నా టిడిపి నాయకులు చాలామంది ఇప్పటికీ మాకు 23 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అని చెప్పు కు బాధపడటం సినిమాలో మూస కామెడీకు ప్రతీక. ఇక రెండు రోజులకోసారి హైదరాబాదు నుంచి జూమ్ పాఠాలు చెబుతూ, అర్థం పర్థం లేని ప్రకటనలు చేసే టిడిపి అధినేత కిందిస్థాయి కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో లో ఇప్పుడు ఏ అంశం ఎత్తుకొని పార్టీను లైమ్ లైట్ లో చాలా ఆయనకే తెలియడం లేదు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలెవరు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసి.. ఆ ఉద్యమం కోసం భారీగా చందాలు వసూలు చేసిన బాబు గారు వాటికి లెక్క చెప్పకుండానే జూమ్ లో దాదాపు మూడు గంటలు తగ్గకుండా రోజు విడిచి రోజు క్లాస్ లు తీసుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారు దేనికోసం చెబుతున్నారు సగటు తెదేపా కార్యకర్తలపై అర్థం కాకుండా ఉందని కిందిస్థాయి కార్యకర్తలు వాపోతున్నారు. కరోన కాలంలో ప్రజలకు ఉపయోగపడే పేదలకు సాయం చేసే పనులు ఏమైనా ఉన్నాయా అని వెతికితే నేతల నోటి నుంచి సమాధానమే కరవు.
ఇంటిపోరు ఇంతింత కదాయా
జాతీయ పార్టీగా బలంగా ఉన్నామని చెప్పుకునే పార్టీ ఇంటి పేరుతో ఇబ్బంది పడుతుంది. నాయకులను సఖ్యత లేదు. ఒకరు అన్నమాట మరొకరు ఖండించే విచిత్ర పరిస్థితి వారిది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు మార్చాక ఈ వివాదాలు మరింత ముసురుకుంటున్నాయి. రకరకాల గ్రూపులు మాటలతో బయటకు బింకన్నీ ప్రదర్శిస్తున్న పార్టీను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు లేక దీపం వేసి వెతుక్కుంటూ ఉంది.
నవ్విన నోళ్లే ముసుకున్నాయి
కరోన అనేది అందరినీ ఓసారి వచ్చి పలకరించి పోయేదే అని సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు హేళన చేసిన వారే ఎక్కువ. ఆయన ఎంతో నిర్భయంగా నిత్య సమీక్షలు చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. సీఎంగా తన స్టైల్లో కరోన అనేది పెద్ద విషయమేమీ కాదని చెప్పి, తాను అంతే నిర్భయంగా ఉంటూ ధైర్యం నింపుతున్నారు. మిగిలిన పార్టీల నాయకులంతా కరోనా భయంతో ఎక్కడికక్కడ ఉంటే సీఎం మాత్రం తొణకాకుండా నిత్యం అందుబాటులో ఉంటూ స్పూర్తినింపడం ఆయన పాలనలో ఓ ల్యాండ్ మార్క్ గా చెప్పొచ్చు.