చంద్రబాబుది మొదటి నుంచి ఒకటే నైజం… తన అవసరాలకు మనుషుల్ని వాడుకున్నామా తర్వాత వదిలేశమా?? మనకి ఎదుటి వ్యక్తి లో పనికొచ్చేదెంత? అన్న రాజకీయ లెక్కలే ఆయన వేసుకుంటాడు.. ప్రతిదీ ఆయన రాజకీయానికి, అధికారం కోసం కలిసి రావాలి… తాజాగా చంద్రబాబు ఖాతాలో తన రాజకీయ భవిష్యత్తును చేజేతులా సమాధి చేసుకుంటున్న వ్యక్తి చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన నూతలపాటి అమర్నాథ్ రెడ్డి. 2014 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరుపున గెలిచి తర్వాత టిడిపిలో కుమారి చంద్రబాబు క్యాబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్రెడ్డి ని ఇప్పుడు చంద్రబాబు పక్కకు పెట్టారు. జిల్లా రాజకీయాల్లో ఆయనకు కనీస ప్రాధాన్యం దక్కడం లేదు. తిరుపత లోక్‌సభ ఉప ఎన్నికల కోర్ కమిటీలోనూ ఆయన లేరు. ఇప్పటి వరకు ఉప ఎన్నికల కోసం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన కనిపించలేదు.
అప్పుడు జగన్ ను కాదని.. ఇప్పుడు తీరని బాధని!!
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నూతలపాటి కుటుంబానికి, నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి, నారా కుటుంబాలది ప్రత్యేకమైన స్థానం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో నూతలపాటి కుటుంబం హవా ఒకప్పట్లో ఎంత ఉండేది. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి మొదటినుంచి టిడిపి వాదిగా చిత్తూరు పశ్చిమ మండలాల్లో ఒక వెలుగు వెలిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ గానూ పనిచేసిన ఆయన… ఎప్పటికైనా మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని ఉవ్విళ్ళురేవరు. అయితే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథరెడ్డి 1999లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అదే సమయంలో రామకృష్ణారెడ్డి ఎంపీగా ఉండడంతో చంద్రబాబు క్యాబినెట్లో ఆయనకు స్థానం లభించలేదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా పనిచేసిన రామకృష్ణ రెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో టిడిపి మొదటి నుంచి ముందుకు తీసుకు వెళ్లారు. విపత్కలంలో సైతం రామకృష్ణారెడ్డి టిడిపిని వీడలేదు.
అయితే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా అమర్నాథరెడ్డి 2012 లో జగన్‌ను కలుసుకొని వైఎస్సార్సీపీలో చేరడం… అనంతరం నియోజకవర్గం మార్పుచెంది పలమనేరుకు రావడం ఒకేసారి జరిగిపోయాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పలమనేర్ నుంచి గెలిచిన అమర్నాథరెడ్డి… అతి తక్కువ సమయంలోనే టిడిపి చెంత చేరారు. పార్టీ మారి వచ్చినవారితో కనీసం రాజీనామా చేయించి కుండానే చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి అమర్నాథరెడ్డిని మంత్రిగా చేసారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అమర్నాథరెడ్డి పలమనేరు నుంచి… 32 ఏళ్ల వయసున్న ఓ చిన్న పాటి కాంట్రాక్టర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. నిజం చెప్పాలంటే అమర్నాథరెడ్డి రాజకీయ ప్రయాణం అక్కడితో ముగిసినట్లే. పశ్చిమ మండలాల్లో ఎంతో పట్టున్న నూతలపాటి కుటుంబం నుంచి వచ్చిన అమర్నాథరెడ్డి కనీసం అక్కడ తన ప్రభావం చూపించకపోవడం… తెదేపా అధినేతను సైతం సందిగ్ధంలో పడేసింది. అమర్నాథ్ రెడ్డి కి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే ఏమాత్రం నెట్టుకు రాలేరనే లెక్కలు బాబు మొదలుపెట్టారు. సొంత జిల్లాలో అత్యంత మాత్రంగానే ప్రభావం చూపించగల తెదేపా అధినేత చంద్రబాబు అమర్నాథరెడ్డి విఫలం కావడంతో ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. ఈ మార్పులో భాగంగా నే తిరుపతి ఉప ఎన్నికల్లో అమర్నాథరెడ్డి ని వ్యూహత్మకంగా పక్కకు తప్పించారు.
చెప్పుకోలేక…. బయటకు రాలేక!!
నిజం చెప్పాలంటే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పార్టీ మారి వస్తానని ప్రకటించగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్ అమర్నాథ్ రెడ్డి కి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించారు. పలమనేరు టిక్కెట్‌ను ఖాయం చేశారు. అయితే పార్టీ మారి గెలిచినంత సమయం కూడా పార్టీలో ఆయన ఉండలేకపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే వివిధ రకాల ప్రయత్నాలు చేసి చంద్రబాబుతో ఉన్న పాత పరిచయాలను ఉపయోగించుకొని క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. చంద్రబాబు కనీసం అమర్నాథ్ రెడ్డి కి పార్టీ కార్యక్రమాల్లో సైతం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం… చిత్తూరు జిల్లాలో కీలకంగా భావిస్తున్న తిరుపతి ఉప ఎన్నికల్లో అమర్నాథరెడ్డి కి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా అవమానించడం ఇప్పుడు అమర్నాథరెడ్డి కక్కలేక మింగలేక అన్నట్లుగా బాధపడుతున్నారు. మళ్లీ పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వద్దాం అని భావించిన జగన్ రానిచ్చే పరిస్థితి లేదు. మరోపక్క నానాటికీ టిడిపిలో ఆయనకు తగ్గుతున్న ప్రాధాన్యం చూసి బాధపడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. మాజీ తుడా అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు ఇచ్చినంత ప్రాధాన్యం తనకు తిరుపతి ఉప ఎన్నికల్లో దక్కకపోవడంతో అమర్నాథరెడ్డి తన సన్నిహితులు సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడడం ఇప్పుడు టీడీపీ అధినేత సొంత జిల్లాలోని రాజకీయ పరిస్థితిని అద్దం పడుతోంది.