పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాక్ అధీనంలో లేదని, ఉగ్రవాదుల చెరలో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఆర్మీ మండిపడింది. రావత్ వ్యాఖ్యలు యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నవని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా శాంతికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్తగా కొత్తగా ఏర్పడిన (డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) పోస్టుకు తన అభ్యర్థిత్వాన్ని బలపరుచుకోడానికే ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని గఫూర్ విమర్శించారు.