మనుషుల యాటిట్యూడ్ (వైఖరి) అంశం గురించి పరిశీలనలో భాగంగా సైక్రియాటిస్ట్లు సగం నీళ్ళు నింపిన గ్లాస్‌ను ప్రయోగ పరికరంగా పరిగణిస్తుంటారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారికి ఈ గ్లాస్లో సగం నీళ్ళు కన్పిస్తాయి, నెగటివ్ భావనల్లో ఉన్నవారికి ఖాళీ మాత్రమే కన్పిస్తుంటుంది. నెగటివిటీనీ దాటి ఇంకాస్త పై స్థాయికి చేరినవారికి అసలు గ్లాస్ అక్కడ పెట్టడమే తప్పుగా తోస్తుంటుంది. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల పరిస్థితి అలాగే ఉందంటే అతిశయోక్తి కాదు.
సంవత్సరాలు లెక్కగట్టి అనుభవాన్ని మీదేసుకున్న ‘పెద్దమనిషి’.. కొత్త రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తెలిసినవాడే. తాను అధికారంలో ఉండగా ఏం అడిగినా.. టెంట్లలో కూర్చుని పాలన చేస్తున్నాం ఇంతకంటే ఇంకేమీ చేయలేం అంటూ చేతులెత్తేసేవారు. ఏం చేయలేమంటూ చెబుతూనే.. సొంత మీడియాలో మాత్రం అదేదో జరిగిపోతోంది అంటూ నానా హంగామా చేసారు. అయితే కడుపుకాలిన జనం తమ కసిని ఓట్ల రూపంలో చూపించి పక్కనెట్టేసారు.
ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా చేసిన ప్రజావ్యతిరేక పాలనపై సమర్ధవంతంగా పోరాడిన వ్యక్తికి ప్రజలు పగ్గాలు అప్పగించారు. పగ్గాలందుకున్న తొలిరోజునుంచే తాను ప్రజలకు చేస్తానన్న పనులపై దృష్టిపెట్టి సంక్షేమ పాలన పరుగులు పెట్టిస్తున్నాడు. ‘అదే రాష్ట్రం, అదే ఆర్ధిక పరిస్థితి పైగా దిగుతూ దిగుతూ రెండు లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి దిగాం..’ అయినా సరే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేస్తే మన భవిష్యత్తు ఏంటన్న అనుమానం అనుభవజ్ఞులకు ఏర్పడిపోయింది.
సరిగ్గా ఇక్కడే సగం గ్లాస్ ఉదాహరణనే తీసుకుందా. ప్రజలేమో పాజిటివ్ యాటిట్యూడ్‌తో గ్లాస్లో ఉన్న నీళ్ళను చూస్తున్నారు. ప్రతిపక్షమేమో ఖాళీని చూస్తోంది. అధికారం దూరమైపోవడానికి ప్రజల దృష్టిలోనుంచి చూడకపోవడమేనన్న స్పృహ మాత్రం ఇంకా పెద్దలకు కలిగనట్లు లేదు. ఇప్పుడు అమలవుతున్న కార్యక్రమాలన్నీ మీ టైంలో కూడా చేసుండొచ్చు కదా? అంటూ ప్రజలు సూటిగా అడిగితే వీరి యాటిట్యూడ్ ఏంటో మరింత స్పష్టంగా బైటపడుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ప్రశ్నతో ప్రజలు సిద్ధమయ్యారన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
8612