సాధారణంగా ప్రతిపక్షం..ప్రజల పక్షం అంటారు. ఎందుకంటే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన కనీస బాధ్యత ప్రతిపక్షంపైనే ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి…అవి పరిష్కారం అయ్యేందుకు ప్రతిపక్షం కృషి చేయాలి. పార్లమెంటరీ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు అలానే జరిగేది. అందుకే ప్రతిపక్షాన్ని ప్రజల పక్షం అంటారు. కానీ ఇటివలీ మాత్రం స్వప్రయోజనాలకు, పార్టీ ప్రయోజనాలకే ప్రతిపక్ష పని చేస్తుంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి…కేవలం విమర్శలతో కాలం నెట్టుకొస్తుంది.
అందుకు ఉదాహరణే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టిడిపి వ్యవహరం. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయాన్ని కేటాయిస్తుంది. అంతేతప్ప ప్రజా సమస్యలను నిర్మాణాత్మకంగా లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయటం లేదు. ప్రతిపక్ష టిడిపి వ్యక్తిగత దూషణలకు పోయి..అసెంబ్లీలో రచ్చ చేస్తుంది.
ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులను అడ్డుకోవడానికే ప్రతిపక్షం ఉందనిపిస్తోంది. అందుకు టిడిపి వైఖరికి అద్ధం పడుతుంది. టిడిపి మతి భ్రమించే వైఖరితో రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైఖరి కూడా తిరోగమనంలోకి వెళ్తుంది. టిడిపి అధినేత, శాసనసభ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా యనమల చెప్పిందే వింటున్నారు. దీంతో అసలు సమస్యలు పక్కకు వెళ్లి…టిడిపి ఒంటెత్తు పోకడ ముందుకొస్తుంది. తానే మేథావిగా ఫీలైయ్యే యనమల రామకృష్ణుడు వైఖరి ఎవరికీ అర్థం కావటం లేదు.
మళ్లీ పాత స్వరాన్నే వినిపిస్తోన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలతో వారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలిచారో అర్థం కావటం లేదు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులను అడ్డుకుంటామని ప్రకటించడం వారి రాజకీయ హీనతను తెలుపుతుంది. సెలక్టు కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న సిఆర్డీఎ చట్టం రద్దు, మూడు రాజధానులకు సంబంధించిన బిల్లలను అడ్డుకుంటామని చెప్పారు. అంటే ప్రతిపక్షం కేవలం బిల్లులను అడ్డుకోవడానికే ఉందాని అని అనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆ సమస్యను లేవనెత్తుతాం, ఈ సమస్యను లేవనెత్తుతాం అని చెప్పాల్సిన ప్రతిపక్ష నేతలు బిల్లులు అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం రాజకీయ వ్యవస్థకే సవాల్‌గా మారింది.
శాసన వ్యవస్థలో శాసన సభదే పైచేయి. అయితే కొన్ని సూచనలు, అభిప్రాయాలు చెప్పి మార్పులు, చేర్పులు చేయించుకోవాల్సిన బాధ్యత శాసన మండలి కూడా ఉంది. అంతేతప్ప తమకు మెజార్టీ ఉందని బిల్లులను అడ్డుకోవడం కాదు. అలా టిడిపి ఒంటెత్తి పోకడతో అడ్డుకోవడం వల్లనే ఈ రోజు శాసన మండలి రద్దు వరకు వెళ్లింది. ప్రజా సమస్యలపైన దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రతిపక్ష టిడిపి బిల్లుల ఆమోదం కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటుంది.
8891