ఏపీ లోని నర్శులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల్లో నైపుణ్యం కలిగిన నర్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి నర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే భాద్యతను ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు అప్పగించింది. దీనికోసం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్ఈఈ), ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) సంయుక్త భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సమక్షంలో హెచ్ఈఈ ప్రతినిధులతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకోనున్నారు.