ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి కొందరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఆరంబాక్కం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో వాహనాలు తనిఖీలో ఉన్న పోలీసులు, కోయంబత్తూరు సెంట్రల్ RTO పరిధిలోని వి. రామచంద్రన్ పేరిట రిజిస్టరైన కారుని ఆపి తనిఖీ చేపట్టగా, ఆ కారులో సుమారు 5 కోట్ల 27 లక్షల రూపాయలు నగదుని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఆ కారులో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని నగదుకు సoభందించిన వివరాలను కనుగొనే పనిలో పడ్డారు.
అయితే ఇదే సమయంలో ఆంద్రప్రదేశ్ కి చెందిన ఒక వర్గ మీడియా తమిళనాడులో పోలీసుల సోదాల్లో డబ్బుతో పట్టుబడిన కారు ఆంద్రప్రదేశ్ కి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిది అంటూ , నగదు బదలాయింపులో బాగాంగా ఈ వ్యవహారం నడిచిందంటు కధనాలు ప్రసారం చేశారు. మీడియా ప్రసారం చేసిన కధనాలపై మంత్రి బాలినేని స్పందిస్తూ తమిళనాడు లో పట్టుబడ్డ కారు పై తన స్టికర్ ఉండటం , దానితో పాటు ఆ పట్టుబడిన వారు ఒంగోలు వారు కావడంతో ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే పట్టుబడిన సొమ్ముని తనకి ఆపాదిస్తూ కధనాలు ప్రసారం చేస్తున్నారు అని , వాస్థవానికి ఆ కారుకు తనకి ఎటువంటి సంభందం లేదని దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించి ఎవరిది తప్పైతే వారిని శిక్షించాలని కోరుతున్నట్టు పత్రికా ముఖంగా చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉంటే ఒంగోలు గాంధి రోడ్డులో ఉండే నల్లమిల్లి ఎక్స్క్లూజివ్ బంగారపు షాపు యజమాని నలమిల్లి బలరామ గిరీష్ తమిళనాడులో పట్టుబడ్డ ఆ డబ్బు తనదే అని. ఆ డబ్బు తన వ్యాపారా లావాదేవీలకు సంభందించిన డబ్బు అని, తాము గత 13 ఏళ్ళుగా బంగారం వ్యాపారంలో ఉన్నామని, తమ షాపులో సరుకు నిమిత్తం చెన్నై లో నగలు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బుని తీసుకుని వెళుతున్నట్టు, ఈ నాలుగు నెలల కోవిడ్ కాలంలో అమ్మకాలు మాత్రమే చేసి కొనుగోలు చేయకపోవడం వలన అంత ధనం తమ దగ్గర ఉండిపోయింది అని , వీటికి సంభంధించిన పేపర్లు అన్ని చెన్నై ఇన్కమ్ టాక్స్ వారికి అందజేస్తాము అని చెబుతు ఒక లేఖను విడుదల చేశారు.