థియేటర్లకు మాస్ జాతర చూపించిన మూవీస్ ఇప్పుడు ఓటీటీకి వచ్చేశాయి. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతోపాటు, భళాతందాన లాంటి మీడియం రేంజ్ సినిమాలూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మే 20న ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ మీద ఓ లుక్కేయండి.
ఆర్ఆర్ఆర్
కలెక్షన్స్ లో వెయ్యికోట్లు దాటేసిన జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్ మార్చి 25న విడుదలైంది. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మూవీ మేకర్స్ కు అసూయను కలిగించిన ఈ విజువల్ వండర్ జీ 5లో స్ట్రీమింగ్ మొదలైంది. రూ.100 కడితేనే ఈ సినిమా చూడనిస్తామంది జీ 5. అభిమానుల ట్రోలింగ్ తోవెనక్కు తగ్గి, సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది.
ఆచార్య
చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన మల్టీస్టారర్ ఆచార్య థియేటర్లలో బాగా దెబ్బతింది. చాలామంది చూడలేదు. ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తో పోటీగా ఈ మూవీకి వ్యూస్ ఉండొచ్చన్నది అంచనా.
జెర్సీ
నాని హిట్ మూవీ జెర్సీని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరో. మృణాల్ ఠాకూర్ హీరోయిన్లు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయితేనేం? మొబైల్ లో చూడటానికి సరిపడా ఎమోషన్ ఉన్న సినిమా ఇది. థియేటర్లలో ఆడని ఈ సినిమా ఓటీటీలో హిట్ కొట్టడం ఖాయం.
వీటితోపాటు సైలెంట్ గా రిలీజ్ అయిన మోహన్ లాల్ మూవీ 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న జాంబీవ్లి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు మూవీస్ సైలెంట్ కిల్లర్స్. ఈ వీకెండ్ లో చూడటానికి పర్ ఫెక్ట్ ఛాయస్.
భళా తందనాన
శ్రీవిష్ణు నటించిన సినిమా భళా తందనాన. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య డైరెక్టర్. కేథరిన్ హీరోయిన్. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఒకసారి చూడటానికి ఈ సినిమా ఒకే.