కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఉహించని విధంగా సామాన్య ప్రజల సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ సందర్భంలో దేశ రాష్ట్ర ప్రభుత్వాలు తామ ప్రజల రక్షణార్ధం అనేక ఆదేశాలు సర్క్యులర్ల రూపంలో జారీ చేసింది . అందులో లాక్ డౌన్ ఒకటి. అయితే ఊహించని విధంగా ఒక్కసారిగా వచ్చి పడిన ఉపద్రవంతో సామాన్య ప్రజలు మొదట్లో అనేక గందరగోళ పరిస్థితులను ఎదుర్కున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలని సరిగా అర్ధం చేసుకోలేక ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య సమాజంలోని పౌరులు తాము ఎన్నికున్న రాజకీయ నాయకులను మార్గదర్శకత్వం కోసం చూడటం సహజమే. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం, కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే ఈ గందరగోళ పరిస్థితుల్లో తమ పౌరులకు సహాయం చేయటానికి బాధ్యతతో ముందుకు వచ్చినట్టు ప్రకటించింది.
ఢిల్లీకి చెందిన గవర్నర్ ఐ – సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ సంస్థ ఒక ప్రకటనలో ఈ సర్వే అక్టోబర్ 1 నుండి 15 మధ్య మోత్తం 512 లోక్‌సభ ఎంపీల పనీతీరుపై నిర్వహించగా మొత్తం 33,82,560 నామినేషన్లు వచ్చాయని వీటిలో లాక్డౌన్ సమయంలో తమ నియోజకవర్గాలలో ప్రజలకు అండగా నిలబది సహాయాన్ని అందించిన మొదటి 10 మంది పార్లమెంటు సభ్యులను ప్రకటిస్తున్నట్టు నివేదికను విడుదల చేశారు. అయితే వీరిలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన ఎంపీల్లో యూపీలోని ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా టాప్‌లో ఉండగా నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ ముఖ్యనేత వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ మూడవ స్థానాలు సంపాదించినట్లు సంస్థ ప్రకటించింది.