తెలంగాణలో రాజ్యాంగం, కోర్టులు లేనట్టుగా కేసీఆర్ భావిస్తున్నారని, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. కేవలం ఆర్టీసీనే కాదు తెలంగాణ రాష్ట్రమే ప్రమాదంలో పడిందన్నారు. ఆర్టీసీని ఖతం చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు.
హుజూర్నగర్లో వందల కోట్లు ఖర్చు చేసి టీఆర్ఎస్ గెలిచిందని మందకృష్ణ ఆరోపించారు. ఆ అహంకారంతోనే కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…జనరల్ ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్లో పోరాటం చేస్తామని మందకృష్ణ పేర్కొన్నారు.