సర్కారు వారి పాట అనౌన్స్ చేసినప్పటికీ లాక్ డౌన్ వల్ల ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టని మహేష్ బాబు ఈ మధ్య గ్యాప్ లో ఫ్యామిలీతో ఫుల్ గా గడిపాడు కానీ దాంతో పాటే ఇతర వ్యవహారాలు కూడా గట్టిగానే చూసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే అడవి శేష్ తో తీస్తున్న మేజర్ సినిమా పనులతో పాటు తన బ్యానర్ మీద త్వరలో వెబ్ సిరీస్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి గాను తన బెస్ట్ ఫ్రెండ్ దర్శకుడు వంశీ పైడిపల్లిని రంగం;లోకి దించినట్టు వినికిడి. ఇప్పటిదాకా తెలుగులో ఎవరూ తీయనంత గ్రాండ్ గా రిచ్ క్యాస్టింగ్ తో దీనికి స్కెచ్ వేసినట్టుగా విశ్వసనీయ వర్గాల భోగట్ట.
ఒక్క మహేష్ తప్ప తను అడిగితే కాదనలేని ప్రతి ఆర్టిస్టు ఇందులో ఉంటారని తెలిసింది. అయితే జానర్ ఏంటి ఎన్ని ఎపిసోడ్లు అనుకుంటున్నారు లాంటి వివరాలు ఏవీ తెలియలేదు. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమానే రావలసింది. పరశురాం కంటే ముందు వంశీనే లైన్ లో ఉన్నాడు. అయితే సబ్జెక్టు విషయంలో ఎంత ట్రై చేసినా ప్రిన్స్ ని ఒప్పించలేకపోయాడు. దీంతో తర్వాత చూద్దామని ప్రస్తుతానికి ఇలా రూటు మార్చారట. ఇలా స్టార్ హీరోలు కూడా డిజిటల్ లోకి దిగితే దీని రేంజ్ పెరగడం ఖాయం. ఇప్పటికే అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు ఓటిటి మీద సీరియస్ ఫోకస్ పెడుతున్నాడు. మరికొందరు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
థియేటర్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి దానికి అనుగుణంగా తమను తాము బిజీగా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారు. నాని వి ఓటిటిలోకి రావడం చూశాక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అందులోనూ రిటర్న్స్ గ్యారెంటీగా ఉన్న డిజిటల్ ప్లాట్ ఫారం మీద పెట్టుబడులకు అంత రిస్క్ కనిపించడం లేదు. అందుకే మహేష్ ఈ కోణంలో అలోచించి ఉండవచ్చు. అసలే కోట్లు పోసిన ఎఎంబి మల్టీ ప్లెక్స్ ఆరు నెలలుగా మూతబడింది. ఆడియన్స్ మునుపటిలా వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంతా నార్మల్ అయ్యేలోపు ఇలా వెబ్ సిరీస్ లాంటివి ప్లాన్ చేసుకోవడం మంచిదే. అందులోనూ వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్ అయితే ఖచ్చితంగా అంచనాలు బాగుంటాయి. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఫిలిం నగర్ లో ఈ టాక్ అయితే జోరుగా ఉంది