దేశంలో ఏ మూల ఎన్నికలన్నా బీజేపీ గెలుస్తుందన్న మూడ్ నెలకొనివున్న పరిస్థితిలో హర్యాన, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజకీయాల్లో ఆధిక్యతలు సుస్థిరం కాదని సూచిస్తున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ + శివ సేన కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. కానీ గత 2015 ఎన్నికల్లో బీజేపీ ,శివ సేన వేరు వేరుగా పోటీ చేసి బీజేపీ 122,శివ సేన 63 స్థానాలు గెలవగా ఎన్నికల్లో కూటమిగా బీజేపీ – 95+ శివ సేన – 61 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
2015లో కాంగ్రెస్ ,NCP విడి విడిగా పోటీ చేసి కాంగ్రెస్ 42,NCP 41 స్థానాలు గెలవగా ఈ ఎన్నికల్లో కూటమిగా కాంగ్రెస్ 40,NC 52 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
శివసేనను బుజ్జగించి వారి డిమాండులను అంగీకరించి పొత్తుకు వోప్పించటం అమిత్ షా కు ఎన్నికల మీద పట్టును సూచిస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ శివ సేన కూటమి గెలుస్తుందంటే పొత్తే ప్రధాన కారణం.
2014 సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ సాధించిన గొప్ప విజయాలలో మొదటిది హర్యానాలో సొంతంగా పూర్తి మెజారిటీతో గెలవటం,రెండవది త్రిపురలో స్థానిక తిరుగుబాటు పార్టీతో పొత్తుపెట్టుకొని గెలవటం.
మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గింది. ప్రస్తుతం 40 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 30 JJP ( జన నాయక్ జనతాపార్టీ ) 10 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
హర్యానాలో కాంగ్రెస్ బలం 15 నుంచి 30 స్థానాలకు రెట్టింపు అవ్వగా బీజేపీ బలం 7 స్థానాలలో తగ్గుతుంది.
ఫలితాలు పూర్తయ్యే సమయానికి బీజేపీ అధికారానికి 3 – 4 సీట్ల దూరంలో ఆగొచ్చు. స్వతంత్రులు,బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు మద్దతుతో లేదా 3 స్థానాలు సాధించే అవకాశం ఉన్న INLD మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు.
1966లో హర్యానా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపార్టీ అధికారాన్ని నిలుపుకోలేదు. ప్రతి ఎన్నికలో అధికారం మారింది. “ఆయారాం గయారాం ” అన్న పేరు కూడా హర్యానా రాజకీయాల్లో నుంచి వొచ్చిందే.
కాంగ్రెస్ కర్ణాటక ఫార్ముల ప్రయత్నం చెయ్యటం అనవసరం, మూడు రోజుల ముచ్చట కోసం బీజేపీ ని అడ్డుకునే ప్రయత్నం చెయ్యటం కన్నా కాంగ్రెస్ సచ్చిపోతుందన్న ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో హర్యానా ప్రజలు వారికి రెట్టింపు సీట్లు ఇవ్వటాన్ని గౌరవంగా తీసుకొని ప్రతిపక్ష పాత్రను హుందాగా తీసుకుంటే వారికి రాజకీయ భవిషత్తు బాగుంటుంది.
హర్యానాలో JJP సాధిస్తున్న స్థానాల పట్ల ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా(దేవిలాల్ కొడుకు) కొడుకులు అభయ్ చౌతాలా ,అజేయ చౌతాలా మధ్య వొచ్చిన విబేధాల వలన అజయ్ చౌతాలా కొడుకులు దుశ్యంత్ మరియు దిగ్విజయ్ 10 నెలల కిందట INLD నుంచి బయటకొచ్చి JJP ని స్థాపించారు.
ఓం ప్రకాష్ చౌతాలతో పాటు ఆయన కొడుకు అజయ్ చౌతాలా కు Recruitment scamలో శిక్షపడింది. INLD మద్దతుదారులతో ఎక్కువ శాతం మంది అజయ్ చౌతాలా కొడుకులు స్థాపించిన JJP కి ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు.రాబోయే కాలంలో INLD అస్తిత్వాన్ని కోల్పోయి JJP రాజకీయాల్లో స్థిరపడచ్చు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మీద పోలింగ్ రోజు సాయంత్రమే కాంగ్రెసు ఆశలు వొదులుకుంది.