తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం(గజ్వెల్) లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఫాంహౌజ్‌లో వెంకటేశ్వర్లు హెడ్‌గార్డ్‌గా విధుల్లో ఉన్నట్టు సమాచారం.