గత మూడురోజులుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ లో స్పష్టత వచ్చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఆశలకు పెద్ద గండి పడుతోంది. ట్రంప్ గెలుస్తాడన్న అంచనా ఉన్న రాష్ట్రాల ఫలితాల్లో కూడా జో బైడెన్ ఆధిక్యత సాధిస్తున్నారు. దాంతో వైట్ హౌస్ కి కొత్త బాస్ ఖాయంగా మారుతోంది. అదే సమయంలో 1992లో సీనియర్ జార్జిబుష్ తర్వాత వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకోలేక బోల్తా పడిన అధ్యక్షుడిగా ట్రంప్ పేరు రికార్డులకెక్కుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే వివిధ సంస్థలు ప్రకటించిన ఫలితాల ప్రకారం బైడన్ 253 స్థానాలను గెలచుకున్నారు. అధికారానికి ఆయన మరో 17 స్థానాల దూరంలో ఉన్నారు. అదే సమయంలో ట్రంప్ కేవలం 214 సీట్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్న పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఖంగుతింటోంది. తొలుత స్వల్ప ఆధిక్యత సాధించిన చోట్ల కూడా చివరకు నిరాశ ఎదురవుతోంది.
ఇంకా స్పష్టత రావాల్సిన నాలుగు రాష్ట్రాలకుగానూ కేవలం నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ కి ఆధిక్యం కనిపిస్తోంది. నార్త్ కరోలినాలో 50.1 శాతం ఓట్లతో ఆయన ఆధిక్యంలో కనిపిస్తున్నారు. కౌంటింగ్ మొదలయినప్పటి నుంచి ట్రంప్ స్థిరంగా ఆధిపత్యం చూపిస్తుండటంతోపాటు అది సాంప్రదాయక రిపబ్లిక్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న రాష్ట్రం కావటంతో ట్రంప్ గెలుపు మీద ధీమా కనిపిస్తుంది. ట్రంప్ కచ్చితంగా గెలవగలిగిన మరో రాష్ట్రం అలస్కా. ఈ రెండు రాష్ట్రాలతో కలిపి ట్రంప్ కు 232 ఎలెక్ట్రోల్ ఓట్లు దక్కుతాయి.
Also Read: ఆ పార్టీ నేత ఈ పార్టీ ఏజెంట్..!
అదే సమయంలో ట్రంప్ మొదటి నుంచి ఆధిక్యతను చాటుకున్న పెన్సిల్వేనియాలో తాజాగా పట్టు కోల్పోయారు. తాజా లెక్కింపులో 49.5 శాతం ఓట్లతో బైడన్ ముందంజ వేయగా, 49.4 శాతం ఓట్లతో ట్రంప్ ఉన్నారు. ఇరువురి మధ్య తొమ్మిది స్వల్ప ఓట్లు మాత్రమే తేడా ఉండడంతో 20 సీట్లున్న పెన్సిల్వేనియా ఆసక్తి రేపుతోంది. పెన్సిల్వేనియాలో ట్రంప్ ఒకదశలో 7.5 లక్షల మెజారిటీ ఉండటం గమనార్హం.పెన్సిల్వేనియాలో బైడన్ ఆధిక్యతకి రావటంతో డెమొక్రాట్ పార్టీ మద్దతుద్దరుల మొదటి నుంచి చెబుతున్నాట్లు పెన్సిల్వేనియాలో బైడన్ గెలవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక్కడ ఇంకా 1.20 లక్షల ఓట్లు లెక్కించవలసి ఉంది. ఈ రాష్ట్రంలో 20 ఎలెక్ట్రోల్ ఓట్లు ఉన్నాయి.
జార్జియాలో 99 శాతం ఓట్లు లెక్కించిన తర్వాత ఇరువురి మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది.ఇక్కడ కూడా ట్రంప్ మెజారిటీ 2.5 లక్షల నుంచి సున్నాకు పడిపోయింది,ప్రస్తుతం బైడన్ దాదాపు రెండు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నాడు.ఇక్కడ ఇంకా ఐదు వేల ఓట్లు లెక్కించవలసి ఉంది. ఈ రాష్ట్రంలో 16 ఎలెక్ట్రోల్ ఓట్లు ఉన్నాయి.
Also Read: పోలవరం పేరు చెప్పి బాగా వెనుకేసిన ఆ టిడిపి ఎమ్మెల్యే ఎవరు.. ?
ఇంకా ఓట్ల లెక్కింపు సాగుతున్న నెవడా, అరిజోనా రాష్ట్రాల్లో బైడన్ స్పష్టమైన విజయం సాధించే దిశలో సాగుతున్నారు. అరిజోనాలో బైడన్ మెజారిటీ తగ్గుతున్నా తుది ఫలితం ఆయనకే అనుకూలంగా ఉండవచ్చు. ప్రస్తుతం బైడన్ దాదాపు 41 వేల మెజారిటీతో ఉన్నారు.ఈ రాష్ట్రంలో 11 ఎలెక్ట్రోల్ ఓట్లు ఉన్నాయి.
అమెరికా ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఓట్ల తేడా 0.5 శాతం కన్నా తక్కువగా ఉంటె రీ కౌంటింగ్ కి అప్పీల్ చేసే హక్కు ఉంటుంది. దాంతో జార్జియా లో ట్రంప్ రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంది. రీకౌంటింగ్ జరిగితే తుది ఫలితాలు వెలువడేందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టొచ్చు. జార్జియా ఫలితాలతో సంబంధం లేకుండా అరిజోనా,నెవడా ఫలితాలతో బైడన్ గెలుస్తే ఎన్నిక ప్రక్రియ సాఫీగా ముగిసినట్లే.
Also Read: ఏపీ ప్రజలకు ప్రజా సంకల్ప పాదయాత్ర కానుక