ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వర్గాల్లో గుర్తింపు ఉన్న సీనియర్ నేత ఎస్ ఎం జియావుద్దీన్. చాలాకాలంగా చంద్రబాబు వెంట ఆయన నడిచారు. నాలుగు ఎన్నికల్లో బరిలో దిగి రెండు సార్లు విజయం సాధించి, గుంటూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు.
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తనను అకర్శించినట్టు ఆయన చెబుతున్నారు. చంద్రబాబు మరోసారి బీజేపీ వెంట వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. మోడీ హయాంలో ఏపీకి అన్యాయం జరిగినట్టు ఊరువాడా తిరిగి విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అంటూ మండిపడ్డారు.
Also Read:వైసీపీ గూటికి లాల్ జాన్ బాష సోదరుడు ,మాజీ ఎమ్మెల్యే జీయావుద్ధిన్
జియావుద్దీన్ రాకతో గుంటూరు వైఎస్సార్సీపీ బలం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే ముస్తఫా కి తోడుగా కొన్ని నెలల క్రితం టీడీపీ తరపున గెలిచిన మద్దాల గిరిధర్ కూడా జగన్ కి జై కొట్టారు. ఇప్పుడు మైనార్టీ నేత రాకతో అధికార పార్టీ హవాకి అడ్డుఉండదని చెబుతున్నారు. అదే సమయంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని అనడానికి నిత్యం కొనసాగుతున్న వలసలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని జియావుద్దీన్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
Also Read:బీజేపీలో చేరటం కోసమే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు,8 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారా?
జియావుద్దీన్ వెంట పలువురు టీడీపీ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు నగరంలోని సుమారు 10 డివిజన్లకు చెందిన నేతలు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దాంతో గడిచిన రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబు వెంట నడిచిన నేతలు ఆపార్టీకి దూరం కావడంతో గుంటూరులో టీడీపీకి కష్టం కాలం దాపురించినట్టు భావిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద ఇన్నాళ్లుగా విశ్వాసంతో పనిచేసిన కార్యకర్తలు కూడా భవిష్యత్తు దృష్ట్యా టీడీపీని వీడేందుకు సిద్దమవుతుండడం తాజాగా జియావుద్దీన్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పునాదులు కదులుతున్న తీరుని ఈ పరిణామాలు చాటిచెబుతున్నాయి.